- ముత్యంపేట గ్రామస్తుల నిరసన
కొండగట్టు, వెలుగు : జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయంలో ఔట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేయనున్న10 స్వీపర్ పోస్టులు స్థానికులకు కేటాయించాలని ముత్యంపేట గ్రామస్తులు కొండగట్టు ఆలయం వద్ద ఆదివారం నిరసన తెలిపారు. ఆదిత్య ఏజెన్సీ ద్వారా రెండు రోజుల కింద టెంపుల్ అధికారులు 10 స్వీపర్ పోస్టుల నియామకం చేపట్టారు. కాగా గత కొన్నేండ్లుగా కొండగట్టు గుట్టపైన కేవలం రూ.3వేల జీతంతో 36 మంది తాత్కాలికంగా పనిచేస్తున్నారు.
ఔట్సోర్సింగ్ ద్వారా చేపట్టిన నియామకాల్లో వీరికి ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సూపరింటెండెంట్ సునీల్ కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ముత్యంపేట సర్పంచ్ తిరుపతి రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.