జన్నారం,వెలుగు: జన్నారం మండలంలో కబ్జాకు గురైన చెరువులతో పాటు ప్రభుత్వ భూములను రాష్ట్ర సర్కారు స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ ముజాఫర్ ఆలీఖాన్ కోరారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు.
చెరువులు,ప్రభుత్వ స్థలాల రక్షణ పై హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన హైడ్రా తరహలో ప్రత్యేకంగా ఒక యంత్రాంగం ఏర్పాటు చేసి కబ్జా చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతరం తహసీల్దార్ రాజామనోహర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు మిక్కిలినేని రాజశేఖర్, మోహన్ రెడ్డి, సయ్యద్ ఇసాక్, సుభాశ్ రెడ్డి, మేకల మాణిక్యం, రియాజోద్దిన్, సయ్యద్ ఫసిఉల్లా, కంప సుధీర్, లక్ష్మీనారాయణ, గోపి సత్యనారాయణ, పంకజ తదితరులు పాల్గొన్నారు.