అహంకారం దించారు : ప్రభుత్వ స్కూల్ టీచర్ అరెస్టు.. పిల్లలతో ఇలానా చేయించేది..

ఉత్తరప్రదేశ్లో ముజఫర్ నగర్ ఘటన మరువక ముందే మరో టీచర్ దురాగతాలకు సంబంధించిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.  ఓ  ప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థి పట్ల టీచర్ ప్రవర్తించిన తీరుపై విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన గురువారం( సెప్టెంబర్ 28) సాంహాల్ జిల్లాలో ఓ ప్రైవేట్  స్కూళ్లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని విద్యార్థిని అవమానకర రీతిలో కొట్టించింది ఓ ప్రైవేట్ టీచర్. ఓ హిందూ విద్యార్థిని ప్రశ్న అడగ్గా సమాధానం చెప్పలేదు. దీంతో ఆగ్రహించిన ఆమె చెప్పుతో కొట్టమని తోటి విద్యార్థి అయిన ముస్లిం బాలుడిని ఆదేశించింది. ఈ విషయం తెలిసిన విద్యార్థి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

విద్యార్థి 5వ తరగతి చదువుతున్నాడని, ఉపాధ్యాయుడి కోరిక మేరకు ముస్లిం విద్యార్థిని హిందూ విద్యార్థిని చెప్పుతో కొట్టమని చెప్పాడని బాధిత విద్యార్థి తండ్రి  అస్మోలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన తన పిల్లల మనోభావాలను గాయపరిచిందని ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని తండ్రి విజ్ఞప్తి చేశారు. IPC సెక్షన్ 323 , 153-A (మతం ఆధారంగా శత్రుత్వాన్ని ప్రోత్సహించడం) కింద టీచర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు టీచర్ ను అరెస్ట్ చేశారు. 

ALSO READ : మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు..

ముజఫర్‌నగర్‌ స్కూల్‌లో ఘటన

ఈ సంఘటన ముజఫర్‌నగర్ పాఠశాల (నేహా పబ్లిక్ స్కూల్) జరిగింది.  ముస్లిం విద్యార్థిని చెంప దెబ్బలు కొట్టమని క్లాస్‌మేట్స్‌ను ఆదేశించాడు టీచర్.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై పెద్ద దుమారమే రేగింది. ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బాధితులు.