వరదల్లో సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి కొత్తవి ఇస్తాం : ముజామ్మిల్ ఖాన్

వరదల్లో సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి కొత్తవి ఇస్తాం : ముజామ్మిల్ ఖాన్
  • కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ 

ఖమ్మం టౌన్, వెలుగు :  ముంపు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల వల్ల సర్టిఫికెట్లు, విలువైన డాక్యుమెంట్లు పోగొట్టుకున్న వారికి ‘నా ఖమ్మం కోసం నేను’  కార్యక్రమంలో భాగంగా సర్టిఫికెట్ల జారీకి చర్యలు చేపట్టినట్లు  కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో ఈ విషయంపై సమీక్ష నిర్వహించారు.  దీని కోసం  ఖమ్మం నగర పాలక సంస్థ పరిధి మినహాయించి..  గ్రామీణ ప్రాంతాలు, సత్తుపల్లి, వైరా, మధిర పట్టణ ప్రాంతాల్లో 72 బృందాలను ఏర్పాటుచేశామన్నారు.

ఈ బృందాలు ముంపు ప్రాంతాల్లో పర్యటించి   10 రోజులు దరఖాస్తులు తీసుకుంటారని చెప్పారు.  సర్టిఫికెట్ల జారీకి మీ సేవ, ధరణి, ఇతరత్రా రుసుము, లామినేషన్ ఖర్చు  ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఈ సమీక్ష లో ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్. పి. శ్రీజ, శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవి బాబు, ఎల్డిఎం శ్రీనివాస రెడ్డి, ఈడీఎం దుర్గాప్రసాద్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.