బైక్స్ కార్లలో మీరు పిల్లలను తీసుకెళుతున్నారా.. అయితే కొత్త రూల్స్ వచ్చాయి.. ఖచ్చితంగా తెలుసుకోవాలి..!

బైక్స్ కార్లలో మీరు పిల్లలను తీసుకెళుతున్నారా.. అయితే కొత్త రూల్స్ వచ్చాయి.. ఖచ్చితంగా తెలుసుకోవాలి..!

కార్లు, బైకులపై పిల్లలను తీసుకెళ్లేవారు ఈ కొత్త రూల్స్ గురించి తప్పకుండా తెలుసుకోండి.. పిల్లల భద్రత కోసం కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ రూల్స్ దేశమంతటా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 4ఏళ్ళు పైబడిన పిల్లలను బైకుపై తీసుకెళ్లాలంటే వారికి హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలని... కార్లలో ప్రయాణించే పిల్లలకు సీట్ బెల్ట్ తో పాటు 4.5 అడుగుల లోపు ఎత్తు ఉన్న పిల్లలకు బూస్టర్ కుషన్ తప్పనిసరి చేస్తూ కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

చాలా రోడ్డు ప్రమాదాల్లో పిల్లలు ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం భద్రతా ప్రమాణాలు పాటించకపోవటమే అని చెప్పాలి. చైల్డ్ సేఫ్టీ రూల్స్ పాటించటం వల్ల మన పిల్లల ప్రాణాలు కాపాడుకోవచ్చు.

కార్లలో పిల్లల భద్రత కోసం:

16 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కార్లో ప్రయాణించే సమయంలో చైల్డ్ రిస్ట్రైనింగ్ సిస్టం ( CRS ) తప్పనిసరిగా ఫాలో అవ్వాలి.

4 సంవత్సరాల కంటే ఎక్కువ మరియు 14 సంవత్సరాల పిల్లలు.. 4.5 అడుగుల కంటే తక్కువ ఎత్తు ఉన్న పిల్లలకు చైల్డ్ బూస్టర్ కుషన్స్, సేఫ్టీ బెల్ట్ తప్పకుండా వాడాలి.

బైకులపై పిల్లల భద్రత కోసం: 

బైకులపై ప్రయాణించే 4 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు హెల్మెట్ తప్పనిసరి.

పిల్లలు బైకుపై ప్రయాణించే సమయంలో నిద్రపోతారు కాబట్టి.. సేఫ్టీ బెల్ట్ (రైడర్ కి కట్టే బెల్ట్ ) లాంటివి వాడటం ఉత్తమం.

అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ కొత్త రూల్స్ పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని.. డిసెంబర్ నుంచి ఈ రూల్స్ అతిక్రమిస్తే జరిమానా విధించాలని నిర్ణయించింది కేరళ ప్రభుత్వం.