భద్రత మన అందరి బాధ్యత : ఎంవీఐ శంకర్ నారాయణ

భద్రత మన అందరి బాధ్యత : ఎంవీఐ శంకర్ నారాయణ
  • ఎంవీఐ శంకర్ నారాయణ

సిద్దిపేట, వెలుగు: రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని శంకర్ నారాయణ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని క్రాంతి హై స్కూల్ లో స్టూడెంట్స్​కు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించినప్పుడే  ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. 18 ఏళ్లు నిండిన వారందరూ లైసెన్స్ తీసుకోవాలని సూచించారు. 

మద్యం తాగి వాహనాలు నడపకూడదని, బైక్​నడిపేవారు హెల్మెట్, కారు నడిపేవారు విధిగా సీటు బెల్టును పెట్టుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే  చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్​స్పెక్టర్​నేహా, శ్రీకాంత్ రెడ్డి, స్కూల్​చైర్మన్ అర్పితా రెడ్డి, కరస్పాండెంట్ భగవాన్ రెడ్డి, ప్రిన్సిపాల్ కుమార్ స్వామి, టీచర్లు, స్టూడెంట్స్​ పాల్గొన్నారు.