ప్రతీ కుటుంబంలో మహళల ప్రభావితం ఎక్కువగా ఉంటుందని, కుటుంబ మనుగడలో ఆడవాళ్ళ పాత్ర కీలకమని అన్నారు రాంచరణ్(Ram Charan) సతీమణి ఉపాసన(Upasana). ఇటీవల ఆమె నాలెడ్జి సిటీలోని టి–హబ్‌లో ట్రంఫ్ ఆఫ్ టాలెంట్ హౌజ్ ఆఫ్ మేకప్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా వివిధ రంగాలలో రాణించిన మహిళలకు విమెన్ ఆఫ్ ఇంపాక్ట్ అవార్డుల అందజేశారు. ఈ కార్యక్రమం బుధవారం అట్టహాసంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఉపాసన కొణిదెల మాట్లాడుతూ.. మా అత్తమ్మ సురేఖ గారు చాలా ప్రేమగా ఉంటారు.. ఆవిడే నాకు స్ఫూర్తి. ముఖ్యంగా ఎలాంటి విషయాల్లో అయినా ధైర్యంగా, ధృఢంగా ఉండే మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపేందుకే ఈ అవార్డుల కార్యక్రమం. అందుకోసమే నేనే ఇక్కడికి వచ్చాను అని చెప్పుకొచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో ఎలికో లిమిటెడ్ వైస్ చైర్‌పర్సన్ వనితా దాట్ల పాల్గొని.. మహిళలు అన్ని రంగాల్లో రాణించడం చాలా అవసరమని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రామ్ చరణ్ సతీమణి ఉపాసన తన అత్తగారి గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.