మహిళల ఓట్ల కోసం ప్రధాని మోడీ చేస్తున్న ప్రయత్నాలపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ సెటైర్లేశారు. ఐదేళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్ లో మహిళా శక్తి గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. ఈ పథకాలన్నీ ఐదేళ్లుగా ఎందుకు ప్రకటించలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్, ఐటీ రైడ్స్ గురించి విలేఖరులు ప్రశ్నించగా.. ప్రియాంక పై వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ను పక్కనపెట్టి.. నా పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను కూడా హ్యాక్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వానికి ఫోన్ల ట్యాపింగ్ తప్ప మరో పని లేనట్లు కనిపిస్తోందని ప్రియాంక ఎద్దేవాచేశారు.
For More News..
కేసీఆర్ కు కోమటిరెడ్డి హెచ్చరిక
కౌలు చెల్లించలేక.. అప్పులు తీర్చలేక రైతు సూసైడ్