- నిర్లక్ష్యానికి కఠిన చర్యలు.. పని చేస్తే సన్మానాలు, ప్రమోషన్స్ ఉంటయ్ఁ
- అందరికీ మంచి వైద్యం అందాలన్నదే నా లక్ష్యం
- ప్రైవేట్ కు ధీటుగా హాస్పిటల్స్ నిర్మిస్తున్నాం
- ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే.. సర్కార్ బాగుంటుంది
హైదరాబాద్: సర్కార్ వైద్యం మెరుగుపడుతుందని.. రాబోయే రోజుల్లో మరింతగా ఇన్ఫ్రాస్ట్రక్ఛర్ పెంచుతామన్నారు హెల్త్ మినిష్టర్ హరీష్ రావు. వైద్యశాఖామంత్రిగా భాద్యతలు తీస్కున్నఈ ఆరు నెలల నుంచి పలు మార్పులు తీస్కువచ్చాను అన్నారు. వైద్యశాఖ ఇతర శాఖలకు భిన్నమని.. చాలా భాద్యతలు ఉంటాయని చెప్పారు. నేరుగా ప్రజలతో ఇంట్రాక్షన్ ఉంటుందన్న హరీష్.. ప్రతి ఒక్కరికీ మంచి వైద్యం అందాలన్నదే నా లక్ష్యమని తెలిపారు. హాస్పిటల్స్ పరిశుభ్రంగా ఉండాలంటే.. రోగులు, వారి సహాయకుల సహకారం కావాలని.. సర్కార్ దావాఖానాలకు ఎక్కువగా పేద ప్రజలు వస్తారన్నారు. దీంతో.. హాస్పిటల్ క్లీన్ నెస్ లో వీరి సహకారం ఉండదని చెప్పారు. హాస్పిటల్స్ ను పరిశుభ్రంగా ఉంచేందుకు కాంట్రాక్ట్ వ్యవస్థను మారుస్తున్నా, జీతాలు పెంచుతున్నా కాంగ్రెస్, బీజేపీ నాయకులు కళ్లు ఉండి.. హాస్పిటల్స్ లో మెరుగుపడిన వసతులను కళ్లుండి చూడలేకపోతున్నారని తెలిపారు. గీతారెడ్డి, అమిత్ షా వంటి నాయకులు విమర్శలు చేసేముందు సర్కార్ హాస్పిటల్స్ వచ్చి చూడాలన్నారు. గీతా రెడ్డి ఒక డాక్టర్ గా, ఒక మంత్రిగా ఉండి.. తన జహీరాబాద్ హాస్పిటల్ కు ఏం చేశారో చెప్పాలని.. అప్పటకీ ఇప్పటకీ అక్కడ జరిగిన మార్పులు చూడాలన్నారు. ఏదో విమర్శలు చేయాలి అని చేయడం తగదని.. కేంద్రం చెప్పేది ఒకటి.. చేసేది ఒకటన్నారు. అమిత్ షా.. ఆయుష్మాన్ భారత్ అమలు కావడం లేదంటారు.. మళ్లీ వాళ్లే ఆయుష్మాన్ కింద 150 కోట్ల రూపాయిలు శాంక్షన్ చేశారని తెలిపారు. అమలు కాకపోతే శాంక్షన్ చేస్తారా? అని ప్రశ్నించారు. బీజేపీలో ఒక్కో నాయకుడు చెప్పే మాటలకు పొంతన లేదన్న ఆయన..రాష్ట్రం ప్రజారోగ్యం ముందుందని వాళ్లే చెబుతారు.. మరొకరు విమర్శిస్తారన్నారు. కేసీఆర్ సర్కార్ వచ్చిన తర్వాత.. 70 యేళ్లలో ఎన్నడూ జరగని అభివృధ్ది చేశామని తెలిపారు. సర్కార్ దావాఖానాలు, మెడికల్ కాలేజీల సంఖ్య పెంచుతుండంతో.. మెడికల్ సీట్లు పెరుగుతున్నాయని తెలిపారు.
హాస్పిటల్స్ లలో మెడికల్ ఎక్విప్మెంట్ పెంచుతున్నామన్న హరీష్.. సర్కార్ ఎక్విప్మెంట్ లో రిపెయిర్ వస్తే.. మూలకే అన్న చందాన ఉండేదన్నారు. ఇప్పుడు రిపెయిర్ వచ్చిన వెంటనే.. దానిని అందుబాటులోకి తీస్కొచ్చేందు స్పెషల్ గా టీంను పెట్టామని.. మన పిల్లలు పక్క దేశాలకు పోనవసరం లేదన్నారు. సిజేరియన్స్ లో రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. v6 న్యూస్, వెలుగు మంచి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాయన్నారు. సిజేరియన్స్ మీద కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలని.. రోగులు సూపర్ స్పెషాల్టీ వైద్యం కోసం హైదరాబాద్ కు రావల్సి వస్తోందని తెలిపారు. జిల్లాలు, మండల స్థాయిలో హాస్పిటల్స్ ను నిర్మిస్తున్నామన్న ఆయన.. ప్రయివేట్ కు ధీటుగా హాస్పిటల్స్ ను నిర్మిస్తున్నామన్నారు. సర్కార్ దావాఖానాలో కొందరు డాక్టర్స్, నర్సులు కింది స్థాయి సిబ్బంది మాట తీరులో మార్పులు రావాలని సూచించారు. ఇప్పటికే రివ్యూలలో పేషంట్స్ తో మంచిగా మెలగమని చెప్పామన్నారు. ఒక్కరోజులో మార్పులు రావని.. టైం పడుతుంది.. కానీ వ్యవస్థాననే ధీమాగా ఉందన్నారు. హాస్పిటల్స్ ను సడన్ విజిట్ లు చేస్తుంటే.. అక్కడున్న సమస్యలు తెలుస్తున్నాయని తెలిపారు. వాటిని వెంటనే ఆ డిపార్టమెంట్ డాక్టర్లతో మాట్లాడి సాల్వ్ చేస్తున్నా అన్నారు. డైరెక్ట్ గా రోగులతో మాట్లాడుతుంటే .. ఎన్నో సమస్యలు తెలుస్తున్నాయని చెప్పారు. ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. వెంటనే కఠిన చర్యలు తప్పవని..మంచిగా పని చేసేవారికి.. సన్మానాలు, ప్రమోషన్స్ ఉంటాయన్నారు. వెంటనే యాక్షన్ తీస్కోవడంతో.. కొందరు డాక్టర్ల నుంచి నిరసన వస్తుంది.. అయినా ప్రజారోగ్యమే ముఖ్యం అన్నారు. రాష్ట్ర ఖాజానాకు సర్కార్ హాస్పిటల్స్ సబంధం లేదని , అన్ని హాస్పిటల్స్ కు బడ్జెట్ లో కేటాయింపులు చేశామని చెప్పారు. వాటినే రిలీజ్ చేస్తున్నామని తెలిపారు.
హరీష్ ఆరోగ్యంపై..
రోజూ నాలుగు గోళీలు వేస్కుని.. బయటకొస్తా అన్నారు. వ్యాయామం, యోగా చేస్తానని.. టిఫిన్ మాత్రమే ఇంట్లో.. మిగతావి ఎక్కడ పడితే అక్కడే తింటా అన్నారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గం, మంత్రిగా, పొలిటికల్ గా.. అన్నీ చూస్కోవాలి కదా అన్నారు. ప్రస్తుతం చాలామందిలో ముప్పై యేళ్లకే అన్నీ జబ్బులు వస్తున్నాయని తెలిపారు. ఫోన్ వాడకం తగ్గించి.. వ్యాయామం ఖచ్చింతంగా చేయాలన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే.. సర్కార్ బాగుంటుందని తెలిపారు మంత్రి హరీష్ రావు.