మా ఇల్లు బఫర్ జోన్లో లేదు.. అదంతా తప్పుడు ప్రచారం : రంగనాథ్

మా ఇల్లు బఫర్ జోన్లో లేదు.. అదంతా తప్పుడు ప్రచారం : రంగనాథ్

తన ఇల్లు బఫర్ జోన్ లో ఉందంటూ వస్తున్న ప్రచారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. హైదరాబాద్ యూసఫ్ గూడలోని కృష్ణకాంత్ పార్క్  దిగువన ఉన్న తన  ఇల్లు.. 44 ఏళ్ల క్రితం మా నాన్న నిర్మించారని చెప్పారు. తన  ఇల్లు  బఫర్ జోన్లో  ఉందని సోషల్ మీడియాతో పాటు కొన్ని పేపర్లలో వచ్చిన వార్తలో ఎలాంటి వాస్తవం లేదన్నారు రంగనాథ్. కృష్ణకాంత్ పార్కు దిగువున ఉన్న వేలాది ఇళ్ల తర్వాత తన ఇల్లు ఉందన్నారు. 

ఒకప్పటి పెద్ద చెరువునే 25 ఏళ్ల క్రితం కృష్ణకాంత్ పార్కుగా  మార్చారని చెప్పారు రంగనాథ్.  చెరువు కట్టకు దిగువున10 మీటర్లు దాటితే.. కిందన ఉన్న  నివాసాలు ఇరిగేషన్ నిబంధనల మేరకు బఫర్ జోన్ పరిధిలోకి రావని చెప్పారు. చెరువు కట్టకు కిలోమీటరు దూరంలో తమ ఇల్లు ఉందన్నారు.  తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది చేస్తున్న ప్రయత్నాన్ని  ఖండిస్తున్నానని చెప్పారు.  44 సంవత్సరాల క్రితం నిర్మించిన అదే ఇంట్లో మా  తండ్రితో కలిసి ఉంటున్నామన్నారు. 

 ప్రస్తుత కృష్ణకాంత్ పార్కుగా ఉన్న స్థలంలో సుమారు 25 సంవత్సరాల క్రితం ఒక చెరువు ఉండేదన్నారు రంగనాథ్.  చెరువు కట్ట ఎత్తుపై ఆధారపడి దిగువ భాగంలో 5-10 మీటర్ల వరకు ఉన్న స్థలాన్ని  బఫర్ జోన్ గా ఇరిగేషన్ శాఖ పరిగణిస్తుందన్నారు రంగనాథ్. 

 యూసఫ్ గూడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్న  హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇల్లు బఫర్ జోన్ లోనే ఉందని.. అది ఒకప్పటి చెరువని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఆరోపించారు.