నా ఫోన్‌ను ప్రభుత్వం ట్యాప్ చేస్తోంది

 

  •  ఈ విషయంలో కోర్టుకు వెళ్తా.. 

  •  హుజురాబాద్​ ఎమ్మెల్యే పాడి  కౌశిక్ రెడ్డి 


కరీంనగర్: ప్రభుత్వ ఆఫీసర్ల ఫోన్లతో పాటు, తన ఫోన్​ను  ప్రభుత్వం ట్యాప్​ చేస్తుందని హుజురాబాద్​ఎమ్మెల్యే  పాడి కౌశిక్​రెడ్డి ఆరోపించారు.  ఇవాళ  జమ్మికుంట టౌన్ లో మున్సిపల్ ఛైర్మన్ రాజేశ్వర్ రావు  ఇంట్లో  ఏర్పాటు చేసిన  ప్రెస్​ మీట్​లో  ఆయన మాట్లాడారు. .  రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యే. ఎమ్మెల్సీ, ఎంపీల ఫోన్లు ట్యాపింగ్​ జరుగుతుందన్నారు.  దీనిపై తాము కోర్టుకు వెళ్తామన్నారు. 

 కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి  పార్లమెంట్​ పరిధిలో సీపీ ఫోన్​ ట్యాపింగ్​ జరిగితే ఎందుకు స్పందించడం లేదన్నారు.    మేము ఎక్కడికి వెళ్లిన వారికి సమాచారం అందుతోంది.  మా వ్యక్తిగత సమాచారం ఎలా వస్తుంది..?  సీపీ టేలీ కాన్ఫరెన్స్ పెట్టుకోవడం పర్సనల్ విషయం.  ఈ విషయం   కాంగ్రెస్​ ఎమ్మెల్యేకు ముందుగానే ఎలా తెలుస్తుంది.

  సీపీ ఫోన్ కూడా ట్యాప్ అవుతోంది. మా ఫోన్లను చేయరని గ్యారంటీ ఏమిటి ?పోలీస్ యంత్రాంగం ఒక సెక్యూరిటీ వింగ్ . ప్రజల సేఫ్టివింగ్, అలాంటి పోలీస్‌ల ఫోన్లను ట్యాప్ చేయడం సిగ్గు చేటు.  ట్యాపింగ్ మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా?    ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి.. సీఎం కేవలం  రాష్ట్రంలో40 శాతం  మంది రైతులకు  రుణమాఫీ చేశారని  కౌశిక్​ రెడ్డి మండిపడ్డారు.