న్యూఢిల్లీ: హ్యాకర్లు తన ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్ ను హ్యాక్ చేశారని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్ పర్సన్ శ్యామ్ పిట్రోడా చెప్పా రు. క్రిప్టో కరెన్సీ రూపంలో వేల డాలర్లు డిమాండ్ చేస్తున్నారని ఓ వార్తా సంస్థకు వెల్లడించారు. కొద్ది రోజులుగా తనకు బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. ‘‘అడిగిన డబ్బు ఇవ్వకుంటే.. నాపై బురద జల్లడం షురూ చేస్తామని బెదిరిస్తున్నారు. నా ఫోన్ కాంటాక్ట్లోని వ్యక్తులకు నా గురించి తప్పుడు ప్రచారం చేస్తామని హెచ్చరిస్తున్నారు. కాబట్టి, గుర్తుతెలియని ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ నుంచి నా గురించి పేర్కొంటున్నట్లుగా మీకు మెసేజ్ వస్తే, దానిని డిలీట్ చేసేయండి” అని పిట్రోడా విజ్ఞప్తి చేశారు.