
క్లాస్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ(Siva Nirvana) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఖుషి(Kushi), సమంత(Samantha), విజయ్ దేవరకొండ(Vijay devarakonda) కాంబోలో వస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్స్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. దీంతో ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇక తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు దర్శకుడు శివ నిర్వాణ. ఇందులో భాగంగా ఖుషి సినిమా గురించి చాలా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇటీవల ఈ సినిమా కోసం శివ నిర్వాణ తీసుకున్న రెమ్యునరేషన్ కు వైరల్ అయ్యింది. ఆ విషయంలో ప్రత్యేకంగా స్పందించారు శివ నిర్వాణ.
ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ఖుషి సినిమాకు గాను నేను రూ.12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నానని కొన్ని వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి. అది చదివి నేనే షాకయ్యాను. నా స్నేహితులు అయితే ఫోన్ చేసి మరీ.. చూడ్డానికి సైలెంట్‌గా ఉంటావు కానీ.. బానే తీసుకున్నావ్ అని కామెంట్స్ చేస్తున్నారు. అంతెందుకు మా అమ్మ కూడా నా రెమ్యునరేషన్ వార్తలు విని షాకై .. ఫోన్ చేసి మరీ అడిగింది. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అంతంత రెమ్యునరేషన్ మాకే ఇస్తే సినిమాలు ఎలా తీస్తారండి?. అది కూడా నాలాంటి డైరెక్టర్ అంత భారీగా ఏ నిర్మాతలు ఇవ్వరని చెప్పుకొచ్చారు శివ నిర్వాణ.