ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాదే : మంత్రి సీతక్క

ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తనదేనన్నారు మంత్రి సీతక్క. ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అత్రం సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా  కౌటలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి సీతక్క హాజరయ్యారు.   ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  ఆదానీ, అంబానీ, రిలియన్స్, జియోల కోసమే బీజేపీ పనిచేస్తుందని ఆరోపించారు.  బీజేపీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే.. దేవుళ్ళ పేర్లు చెప్తు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. గాంధీని చంపిన  గాడ్సేకు మద్దతు తెలిపి పూజించే పార్టీ బీజేపీ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే దండగా..  బీజేపీకి ఓట్లు వేస్తే అభివృద్ధి రాదన్నారు. రాష్ట్రానికి ఆరు లక్షల కోట్ల అప్పున్న ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లు ఫ్రీ కరెంట, 500 కే గ్యాస్ సిలిండర్‌ను అందిస్తున్నామని సీతక్క తెలిపారు.  మూడు నెలల్లోనే  నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. పార్లమెంటు ఎన్నికల తరువాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటిస్తారని సీతక్క చెప్పుకొచ్చారు.