మా భార్య చాలా గొప్పది.. చూడటానికి ఇష్టపడతా.. వారంలో 90 గంటల పనిపై ఆనంద్ మహీంద్ర కామెంట్స్..

వారంలో 90 గంటలు పనిచేయాలని L&T చైర్మన్ SN సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు ఎంత వైరల్ అయ్యాయో తెలిసిన విషయమే. ‘‘పొద్దంత భార్యను చూస్తూ ఇంట్లో ఏం కూర్చుంటారు.. ఆఫీసుకొచ్చి పనిచేసుకోక’’ అని సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదం అయ్యాయో తెలిసిన విషయమే. దీనిపై సోషల్ మీడియాలో డిబేటే నడిచిందంటే నమ్మండి. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనె L&T చైర్మన్ కు కౌంటర్ ఇవ్వడం మరింత చర్చకు దారి తీసింది. 

తాజాగా ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఒకరకంగా సెటైర్ వేశారని చెప్పవచ్చు. ‘‘మా భార్య వండర్ ఫుల్.. చాలా గొప్పది.. ఆమెను చూడటాని ఇష్టపడతాను’’ అని అన్నారు. దీంతో డైరెక్టుగా L&T చైర్మన్ SN సుబ్రహ్మణ్యన్ చేసిన  ‘‘పొద్దంత భార్యను చూస్తూ ఇంట్లో ఏం కూర్చుంటారు..’’ అనే వ్యాఖ్యలకు  కౌంటర్ ఇచ్చారు.

వారంలో 90 గంటల పనిపై మీ అభిప్రాయం ఏమిటని అడిగిన ప్రశ్నకు.. ‘‘ఎన్ని గంటలు పనిచేశామన్నది కాదు.. ఎంత అవుట్ పుట్ వచ్చిందన్నది ముఖ్యం. ఎంత క్వాలిటీ వచ్చిందన్నది ముఖ్యం. ఎన్ని గంటలు పనిచేశారు అని నన్ను అడగకండి. ఎంత క్వాలిటీ వచ్చిందని అడగండి.’’అని అన్నారు. 

‘‘సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నానంటే ఒంటరిగా ఉండి టైమ్ పాస్ కోసం కాదు. ఎక్స్ లేదా సోషల్ మీడియా ఒక పెద్ద బిజినెస్ టూల్ గా భావిస్తాను. ఒకే వేదికలో 11 మిలియన్ల ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ వస్తుంది’’ అని పేర్కొన్నారు. 

ఎవరైనా ప్రశాంతమైన జీవితం గడిపినపుడే మంచి నిర్ణయాలు తీసుకోగలరని ఆనంద్ మహీంద్ర అన్నారు. ‘‘ఒకవేళ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయలేనపుడు.. ఫ్రెండ్స్ తో గడపలేనపుడు.. ఏదైనా చదవలేనపుడు.. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఎలా వీలవుతుంది. మానసిక ప్రశాంతత లేనపుడు అవుట్ పుట్ ఎలా వస్తుంది’’ అని తన అభిప్రాయాన్ని తెలియజెప్పారు. వర్క్--లైఫ్ బ్యాలెన్స్ ఉన్నపుడే ఏదైనా సాధించగలమని అన్నారు. 

ఇదే విషయంపై ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి వారానికి 70 గంటల పని  ఉండాలని చెప్పిన విషయం తెలిసిందే. అ తర్వాత    L&T చైర్మన్ SN సుబ్రహ్మణ్యన్  90 గంటల కామెంట్స్ వైరల్ అయ్యాయి. మొత్తానికి వర్కర్స్ ఎన్ని గంటలు పని చేయాలనేదానిపై సోషల్ మీడియాలో ఓ డిబేట్ నడుస్తుందనుకోండి.