
మయన్మార్: ప్రకృతి ప్రకోపానికి మయన్మార్ దేశం అతలాకుతలమైంది. భూకంపం సృష్టించిన ప్రళయం అంతాఇంతా కాదు. మయన్మార్ దేశం స్మశానాన్ని తలపించింది. వెయ్యి మందికి పైగా చనిపోవడంతో ఎక్కడ చూసినా శవాల దిబ్బలే. రిక్టర్ స్కేల్పై 7.7 తీవ్రత నమోదైన ఈ భూకంపం మయన్మార్ రూపురేఖలనే మార్చేసింది.
ముఖ్యంగా మయన్మార్లోనే రెండో అతిపెద్ద నగరమైన మాండలేలో పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. మార్చి 28, 2025 మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మాండలేలో భారీ భూకంపం సంభవించింది.
సుమారు 15 లక్షలకు పైగానే ప్రజలు నివసిస్తున్న మాండలే నగరంలో కొద్దిసేపు వ్యవధిలోనే రెండుసార్లు భూకంపం సంభవించింది. 12 గంటల 51 నిమిషాల సమయంలో రిక్టర్ స్కేల్పై 6.4 తీవ్రతతో మాండలేలో భూకంపం వచ్చింది. మళ్లీ.. 01:02 నిమిషాలకే 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.
రెండుసార్లు భూకంపం సంభవించడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మంది మృతదేహాలను రికవరీ చేశారు. వందల మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వేల సంఖ్యలో గాయపడ్డారు. మాండలేలో ఉన్న మహాముని బౌద్ధాలయం కుప్పకూలింది. మాండలేలో ఇర్రావాడి నదిపై నిర్మించిన వంతెన కూలిపోయింది. బ్యాంకాక్ సిటీకి మాండలే నగరం వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉంది.
Also Read :- మయన్మార్ లో మళ్లీ భూకంపం : తీవ్రత 5.3.. ఊగిపోయిన భవనాలు
ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే అవకాశమున్న ప్రాంతాల్లో మయన్మార్ ఒకటి. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, బర్మా మైక్రోప్లేట్‌ల మధ్య మయన్మార్ ఉంటుంది. ఈ ప్రాంతాన్నే ‘సాగింగ్ ఫాల్ట్’గా వ్యవహరిస్తారు. అక్కడ సాగింగ్ పేరుతో పట్టణం ఉండటంతో ఆ ప్రాంతాన్ని అలా పిలుస్తుంటారు. భూమి పొరల అమరికలో లోపాలు ఉండటాన్నే ఫాల్ట్ అంటారు.
మయన్మార్‌లో ఇది దాదాపు 1,200 కి.మీల మేర విస్తరించింది. భూగర్భంలో పొరల అమరికల వల్ల రెండు భూభాగాలు ఒకదానికొకటి కదులుతుంటాయి. ఈ కదలికలు ఏడాదికి 11 మి.మీ నుంచి 18 మి.మీ వేగంగా జరుగుతున్నట్లు సైంటిస్టులు అంచనా వేశారు.18 మి.మీ చాలా ఎక్కువ అని, దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్తున్నారు. ఇవి ఇలాగే కొనసాగుతుండటంతో భూగర్భంలో ఒత్తిడి పెరిగి భూకంపాలకు దారితీస్తుంటాయి.
Before and after shots of important and iconic buildings in Myanmar.#earthquakemyanmar #Burma #Mandalay #earthquake pic.twitter.com/OZDzQndaGV
— Teacher MM (@AquaShotsMedia) March 28, 2025