
మయన్మార్: భూకంపం ధాటికి మయన్మార్ తీవ్రంగా దెబ్బతిన్నది. భూకంపం కారణంగా చనిపోయిన మయన్మార్ ప్రజల సంఖ్య శనివారం రోజుకు(మార్చి 29, 2025) 16 వందల 44కు పెరిగింది. 3 వేల 408 మంది గాయపడ్డారు. 139 మంది ఆచూకీ దొరకలేదు. ఈ విషయాన్ని స్వయంగా మయన్మార్ మిలటరీ కౌన్సిల్ వెల్లడించింది. సాగింగ్, మండాలే, క్యూక్సే, పైన్ ఊ ల్విన్, ష్వెబోతో సహా అనేక పట్టణాల్లోని భవనాలు కుప్పకూలాయి. శుక్రవారం రోజు మయన్మార్ లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించి ఇళ్లు, పెద్ద పెద్ద భవంతులు, హోటళ్లు, ఆలయాలు, వంతెనలు నిమిషాల్లో నేలమట్టమైన సంగతి తెలిసిందే. శిథిలాలు తొలగించే కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతూ పోతోంది.
Death toll is estimated to be over 1,000, but due to internet blackout imposed by Junta exact number remains unknown.
— Sumit (@SumitHansd) March 29, 2025
Pray for Myanmar 🇲🇲 ❤️ 🙏
Please be safe everyone ❤️ #WhatsHappeningInMyanmar#Myanmar #earthquake #แผ่นดินไหว #ตึกถล่ม pic.twitter.com/FGxIhm9Rnp
మయన్మార్ ప్రభుత్వం అంతర్జాతీయ సాయం కోరింది. భారత ప్రభుత్వం ఇప్పటికే మయన్మా్ర్కు రెస్క్యూ టీమ్స్ను, వైద్యులను, మెడిసిన్స్ను పంపింది. మండాలేలోని అతి పురాతనమైన ‘మండాలే ప్యాలెస్’తీవ్రంగా దెబ్బతిన్నది. సాగింగ్ టౌన్‌షిప్‌లోని ఒక వంతెన పూర్తిగా కుప్పకూలింది. రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. శిథిలాలు తొలగిస్తూ క్షతగాత్రులను బయటికి తీసుకొస్తున్నాయి. కొన్నిచోట్ల ఆలయ గోపురాలు కూలిపోయాయి. ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి. పలు మసీదుల్లోని పైకప్పులు కూలిపోయాయి. రంజాన్ కావడంతో మసీదుల్లో పెద్ద సంఖ్యలో ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు.
‼️🇲🇲 Horrific scenes from earthquake-stricken Myanmar, where the death toll has already surpassed 1,000. #earthquake pic.twitter.com/5gF9nlD6CN
— Maimunka News (@MaimunkaNews) March 29, 2025
మయన్మార్‌లో వచ్చిన భూకంపం అత్యంత శక్తిమంతమైందని అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది. రెండేండ్ల కింద ఇంతే తీవ్రతతో టర్కీ, సిరియాలో భూకంపం సంభవించిందని గుర్తు చేసింది. అప్పుడు భారీగా ప్రాణనష్టం చోటు చేసుకున్నదని తెలిపింది. ముఖ్యంగా మయన్మార్, థాయ్‌లాండ్ జనసాంద్రత అత్యధికంగా ఉన్న ప్రదేశాలు కావడంతో వీటిని రెడ్ ఈవెంట్లుగా పరిగణిస్తామని వెల్లడించింది. రెండేండ్ల కింద టర్కీలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించడంతో 53 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మయన్మార్, థాయ్లాండ్లోనూ భారీగా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని తెలిపింది.
ALSO READ | Myanmar Earthquake: భూకంపానికి ముందు.. తర్వాత మయన్మార్ ఎలా ఉందో చూడండి..!