న్యూఢిల్లీ: జాబ్స్, ట్రెయినింగ్, నెట్‌వర్కింగ్, బిజినెస్ అవకాశాలన్నింటికి ఒకే వేదికగా మైభారత్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నిలుస్తుందని లేబర్ మినిస్టర్ మన్షుఖ్ మాండవీయా అన్నారు. దేశంలోని యువత ఉదయం లేవగానే వాట్సాప్ చూడొద్దని, మైభారత్ చూడాలని పిలుపునిచ్చారు. ఏఐఎంఏ యంగ్ లీడర్ కౌన్సిల్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు.
వికసిత్ భారత్ 2047 సంబంధించిన పోటీల విజేతలను ప్రధాని మోదీ వచ్చే నెలలో ప్రకటిస్తారన్నారు. జీడీపీ ఏడాదికి 7–8 శాతం వృద్ధి చెందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, దీనర్ధం మాన్యుఫాక్చరింగ్, అగ్రికల్చర్, సర్వీసెస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలు వృద్ధి చెందడమని, ఈ సెక్టార్లలో జాబ్స్ పెరుగుతాయన్నారు.