
మెదక్, వెలుగు : ప్రజలు నమ్మి ఎమ్మెల్యేగా గెలిపిస్తే వారి బాగోగులు పట్టించు కోకుండా సొంత ఆస్తులు కూడబెట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మను తరిమికొట్టాలని కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మండలంలోని రాజ్‌పల్లి, తిమ్మక్కపల్లి, తండా, బాల్నగర్ తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే తన వెంట తిరిగే వాళ్లకు దళిత బంధు, బీసీ బంధు ఇచ్చి మిగితా వారిని మోసం చేశారన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు, అర్హులైన వితంతువులు, దివ్యాంగులకు పింఛన్లు మంజూరు చేయలేదని ఆరోపించారు. రైతు రుణ మాఫీ చేస్తామని చెప్పి మాట తప్పి మోసం చేశారని మండిపడ్డారు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి ఓటుతో గుణపాటం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో శ్రీనివాస్ చౌదరి, మండల పార్టీ అధ్యక్షుడు శంకర్, యూత్ అధ్యక్షుడు రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హాఫీజొద్దీన్, నాగరాజు పాల్గొన్నారు.