మెదక్, వెలుగు: కాంగ్రెస్ రాష్ర్ట నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బర్త్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం కోదండ రామాలయంలో పూజలు, మెదక్ చర్చిలో, పిట్లంబేస్ దర్గాలో హన్మంతరావు పేరు మీద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏడుపాయల దుర్గామాత ఆలయంలో ఆయన పేరు మీద అర్చన చేయించారు.
అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నాయకులు పవన్, గంగాధర్, సుభాష్ చంద్రబోస్, కౌన్సిలర్ లు లింగం, శేఖర్ పాల్గొన్నారు.