హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్కు సమీపంలోని చేవెళ్ల దగ్గర 150 ఎకరాల్లో కొత్త ప్రాజెక్ట్ ఒకటి నిర్మిస్తామని మైరాన్ హోమ్స్ పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ను తీసుకురావడం అభినందనీయమని సినీ నిర్మాత అశ్వనీ దత్, సినీ నిర్మాత నటుడు, మురళీ మోహన్, చిత్ర నిర్మాత కేఎస్ రామారావులు అన్నారు. హైదరాబాద్లో మధ్య, సంపన్న తరగతుల సొంత ఇల్లు , ప్లాట్ కలను మైరాన్ హోమ్స్ తీరుస్తోందన్నారు.
మైరాన్ హోమ్స్ సీఎండీ యం యువరాజు మాట్లాడుతూ.. సుదీర్ఘ అనుభవం, విశ్వసనీయత , పారదర్శకత తో 20 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ సెక్టార్లో కొనసాగుతున్న తాము తెలుగు రాష్ట్రాలలో 17 కి పైగా వెంచర్లను దిగ్విజయంగా పూర్తి చేశామన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలలో ఉన్న ఎంతో మంది వినియోగదారులకు తమ వెంచర్లనందించి వారి అభిమానాన్ని చూరగొన్నామన్నారు. ప్రతి ఒక్కరి సొంతిల్లు కలను నిజం చేస్తూ, త్వరలో మరో మూడు ప్రాజెక్ట్ లను లాంచ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు.