మంథనిలో బీజేపీ గెలుస్తుంది : శశిల్ జి.నామోషి

 మంథని, వెలుగు: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంథనిలో బీజేపీ గెలిచి చరిత్ర సృష్టిస్తుందని మైసూర్ ఎమ్మెల్సీ శశిల్ జి.నామోషి ధీమా వ్యక్తం చేశారు. శనివారంలో మంథని టౌన్‌‌‌‌లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ  సమావేశానికి మైసూర్ ఎమ్మెల్సీ శశిల్ జి.నామెషి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంథని ప్రజలు కొత్తవారికి  అవకాశం ఇవ్వాలని చూస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శీలారపు పర్వతాలు, మాజీ ఎమ్మెల్యే రామ్‌‌‌‌రెడ్డి, లీడర్లు పాల్గొన్నారు.