సంగీత దర్శకుడు ఇళయరాజాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళ డైరెక్టర్ మిస్మన్ పై హీరో, సడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కాకపోతే స్టేజీపై మాట్లాడేటప్పుడు ఓ పద్ధతి ఉంటుందని అన్నారు.
ఇళయరాజా అంటే చాలా మంది ఆరాధాధిస్తారని, అలాంటి వ్యక్తిని అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని తాను క్షమించనని అన్నారు. ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తర్వాత క్షమాపణ చెప్తే అంగీకరిస్తారా..? అని విశాల్ ప్రశ్నించారు.
ఈ విధంగా వ్యవహరించడం డైరెక్టర్ మిస్కిన్కి అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు. ఎంతోమంది సంగీత ప్రియులు ఆరాధించే ఇళయరాజా గురించి అలాంటి కామెంట్స్ చేయడం ఏమాత్రం సరికాదని హితవు పలికారు.
మిస్కిన్ ఏం మాట్లాడరంటే..?
విశాల్ హీరోగా నటించిన ‘తుప్పారివాలన్’ (తెలుగులో ‘డిటెక్టివ్’)తో మిస్కిన్ తెలుగు వారికి ఎంతో సుపరిచితం. ప్రస్తుతం ఈ డైరెక్టర్ నటుడిగాను రాణిస్తున్నారు. " ఇందులో భాగంగా ఇండస్ట్రీలో ఉన్న వారందరికంటే తానే ఎక్కువగా మద్యం తాగుతానని మిస్కిన్ తెలిపారు.
ALSO READ | Pushpa 2 OTT: ఓటీటీలోకి అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
అనంతరం ఇళయరాజా గురించి మిస్కిన్ మాట్లాడారు. ఇళయరాజా సంగీతం వల్ల ఎంతోమంది మద్యానికి బానిసలయ్యారని వ్యాఖ్యలు చేశారు. దీంతో మిస్కిన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మిస్కిన్ తీరును సినీప్రియులతో పాటుగా ఇళయరాజా ఫ్యాన్స్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇక ఆ వెంటనే దర్శకుడు మిస్కిన్ క్షమాపణలు చెప్పారు. తన ఉద్దేశాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. తాను ఎంతో సరదాగా ఆ వ్యాఖ్యలు చేశానని అన్నారు.