
కేరళలో తల్లి, ఇద్దరు కూతుళ్ల ఆత్మహత్య కలకలం రేపింది.. 42 ఏళ్ళ షైనీ కొరియోస్ అనే మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకుంది. షైనీ ఆత్మహత్యకు భర్త నోబి లూకాస్ వేధింపులే కారణమని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. నోబి లూకాస్ షైనీని శారీరకంగా హింసించేవాడని ఎత్తుమనూర్, తోడుపుళా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు నమోదయ్యాయని షైనీ తండ్రి తెలిపారు.షైనీ, ఆమె కూతుళ్ల ఆత్మహత్య గురించి ఫిర్యాదు అందుకున్న తోడుపుళా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
శుక్రవారం ( ఫిబ్రవరి 28, 2025 ) కొట్టాయంలో చోటు చేసుకుంది ఈ ఘటన. శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం వచ్చిందని.. ఘటనాస్థలికి వెళ్లి జరిపిన దర్యాప్తు మేరకు మృతులు షైనీ, ఆమె కూతుళ్లు అలీనా, ఇవానాలుగా గుర్తించామని అన్నారు ఎత్తుమనూర్ పోలీసులు.
ALSO READ : మగాళ్ల గురించి కాస్త ఆలోచించండని చెప్పి.. టీసీఎస్ మేనేజర్ ఆత్మహత్య..
రైల్వే పట్టాలపై మృతదేహాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, గుర్తింపు ప్రక్రియ చాలా కష్టమైందని తెలిపారు పోలీసులు. కేసు నమోదు చేసి మృతదేహాలను కొట్టాయం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మార్చురీకి తరలించామని తెలిపారు పోలీసులు. మృతురాలు షైనీ తన భర్త నుండి విడిపోయిన తర్వాత తొమ్మిది నెలలుగా పరోలికల్ లోని ఇంట్లో ఉంటున్నట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు.