మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. శివపురి జిల్లాలో దాదాపు 200 ఆవుల మృతదేహాలు లభ్యం కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అటవి ప్రాంతంలో ఆవుల మృతదేహాలు లభ్యమయ్యాయి. కరైరా తహసీల్ నుంచి వెళ్లే సలార్‌పూర్ రోడ్డు మార్గంలో జాతీయ రహదారికి 500-600 మీటర్ల దూరంలో ఆవుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు.
చనిపోయిన జంతువులను ఈ ప్రాంతంలో పడేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పశువుల షెడ్లలో మృతి చెందిన ఆవులను ఈ ప్రాంతంలో పారేస్తున్నట్లు అనుమానిస్తున్నార.
ఈ విషయంపై పోలీస్‌స్టేషన్ ఇన్‌చార్జి సురేష్ శర్మ మాట్లాడుతూ.. తమకు సమాచారం అందగానే ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించామని, అయితే ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియలేదని చెప్పారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలిపారు. కాగా, ఆవుల మృతదేహాలపై అటవీశాఖ ఇప్పటి వరకూ స్పందించలేదు.