నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కలకలం.. లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. పిట్టల్లా రాలిపోతున్నాయి. అప్పటికప్పుడు.. కళ్ల ముందే నిమిషాల్లో కోళ్లు చనిపోవటం కోళ్లఫారాల యజమానులను భయాందోళనలకు గురి చేస్తుంది.
ఒక్క భీంగల్ మండలంలో లక్ష కోళ్లు చనిపోయాయని చెబుతున్నారు యజమానులు. ఏదైనా అంతుచిక్కన వైరస్ వచ్చిందా లేక బర్ద్ ఫ్లూనా అనే క్లారిటీ లేక ఆందోళన చెందుతున్న కోళ్ల ఫారం నిర్వాహకులు.
ఇక వేల్పూర్ మండలం లాక్కోరా, శాయంపేటలోనూ ఇదే పరిస్థితి. కోళ్ల ఫారాల్లోని కోళ్లు వేల సంఖ్యలో చనిపోయాయి. అదే విధంగా బాల్కొండ నియోజక వర్గంలోనూ ఇదే పరిస్థితి.
ఫారాల్లో కోళ్లు చనిపోతుండటంతో.. బతికి ఉన్న కోళ్లను అమ్మేసుకుంటున్నారు రైతులు. వైరస్ వచ్చి చనిపోతాయేమో అనే భయంతో.. వచ్చిన ధరకు అమ్మేస్తున్నారు.
Also Read : పర్యాటక హబ్గా కొల్లాపూర్
విషయం తెలిసిన వెంటనే నిజామాబాద్ జిల్లా పశు వైద్యాధికారులు, సిబ్బంది ఆయా గ్రామాల్లో పర్యటించారు. చనిపోయిన, బతికి ఉన్న కోళ్ల నుంచి రక్త నమూనాలు సేకరించారు. ల్యాబ్ కు పంపించారు. కోళ్లు చనిపోవటానికి బర్డ్ ఫ్లూనా లేక మరో ఏదైనా వైరస్ కారణమా అనేది తేలాల్సి ఉంది. కోళ్లు చనిపోతున్న విషయం జిల్లా అంతటా వ్యాపించటంతో.. ఫారం యజమానులు భయాందోళనలకు గురవుతున్నారు. ఉన్న ఫారాలను ఖాళీ చేస్తున్నారు.