జలాల్ పూర్ లో 1,100 కోళ్ల మృతి

 జలాల్ పూర్ లో 1,100 కోళ్ల మృతి

కొల్చారం, వెలుగు: మెదక్ జిల్లా కొల్చారం మండలం ఎన్.జలాల్ పూర్ గ్రామంలో ఉన్న ఓ పౌల్ట్రీ ఫారంలో ఆదివారం 1,100 కోళ్లు మృతి చెందాయి. చనిపోయిన కోళ్లను ట్రాక్టర్​లో ఊరికి దూరంగా తరలించారు. గంటల వ్యవధిలో వందలాది కోళ్లు మృతి చెందడంతో సుమారుగా రెండు లక్షల రూపాయల వరకు నష్టపోయామని పౌల్ట్రీ ఫాం యజమాని సతీశ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం  స్పందించి ఆర్థిక సాయం అందించి  ఆదుకోవాలని కోరాడు. ఇదిలా ఉండగా వందల సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో  బర్డ్ ప్లు వచ్చిందేమో అని ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. 

3 రోజుల్లో 9వేల కోళ్లు మృతి

పుల్కల్ : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం బొమ్మరెడ్డిగూడెం శివారులో గల ఓ కోళ్ల ఫారంలో మూడు రోజుల్లో 9 వేల కోళ్లు మృతి చెందాయి. వారం రోజుల కింద ఇదే మండలంలో తడ్దాన్ పల్లి టోల్ గేట్ సమీపంలోని ఓ ఫారంలో మూడు రోజుల్లో 6 వందల కోళ్లు చనిపోయాయి. వెటర్నరీ డాక్టర్ విశాల్ కుమార్ ఫారాన్ని పరిశీలించి మృతి చెందిన కోళ్ల శాంపిల్స్​సేకరించారు. గత వారం చనిపోయిన కోళ్ల శాంపిల్స్​రిపోర్ట్స్ ఇంకా రాలేదని చెప్పారు. చనిపోయిన కోళ్లను ఫారం నిర్వాహకులు భూమిలో గోతి తీసి  పాతిపెట్టారు.