అంటార్కిటికా మంచు కొండలకు.. హిట్లర్ కు లింక్..? ఆ తలుపు వెనక రహస్యం ఏంటీ..!

అంటార్కిటికా మంచు కొండలకు.. హిట్లర్ కు లింక్..? ఆ తలుపు వెనక రహస్యం ఏంటీ..!

కొంతమంది తెలియని ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. వారు వెళ్లాల్సిన ప్రదేశం ఎక్కడ అని అక్కడ కనిపించిన వారిని అడిగితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతారు.  అయితే టెక్నాలజీ పెరిగిన తరువాత గూగుల్​ మ్యాప్​ ద్వారా గమ్యస్థానానికి ఎవరిని అడగకుండానే వెళ్లవచ్చు.  ఇలా గూగుల్​ మ్యాప్​ సర్చ్​ చేసేటప్పుడు కొన్ని కొన్ని కొత్త విషయాలు కూడా బయటపడతాయి.  ఇప్పుడు అలాగే  అంటార్కిటికాలో  గూగుల్​ మ్యాప్​ యూజర్స్​ కొత్తగా ఒక నాజీ బంకర్ ను కనుగొన్నారు.  అయితే  అది రెండో ప్రపంచ యుద్దం నాటిదని చెబుతున్నారు. సెకండ్​ వరల్డ్​ వార్​ తరువాత  అప్పటి ​ నియంత అడాల్ఫ్​ హిట్లర్​ ఈ బంకర్​ లో నివసించాడని కొంతమంది అంటున్నారు.   

 అంటార్కికిటికాలో..   గూగుల్​ మ్యాప్​లో   కనిపించిన నాజీ బంకర్​ (తలుపు మాదిరిగా ఉన్న చిత్రం)ను ఫేస్​ బుక్​ యూజర్​ జూలై 30న స్క్రీన్​ షాట్​ ను పోస్ట్​ చేశాడు.  ఇది మంచు ఫలకం మాదిరిగా ఉండి తలుపు ఆకారంలో  ఉంది.  రెండో ప్రపంచ యుద్ద సమయంలో ఇది నాజీల రహస్య బంకర్​  కావచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.  రెండో ప్రపంచ యుద్దం సమయంలో  జర్మన్​ అధికారులు అంటార్కిటాలో రహస్య స్థావరాన్ని నిర్మించారని మరికొందరు అంటున్నారు.దీనికోసం అంటార్కిటాకు 1938 లో అప్పటి జర్మన్ ఒక మిషన్ ను పంపిందని చెబుతున్నారు. ఆ తరువాత హిట్లర్ ఇక్కడ నివసించారని అంటున్నారు.  

అయితే ఈ చిత్రానికి సంబంధించి అధికారికంగా ఏ ఏజన్సీ ప్రకటించలేదు.  అయితే గతంలో కూడా ఇలాంటి చిత్రాలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి.   దీనికి కారణం రెండో ప్రపంచ యుద్దం అయిన తరువాత  హిట్లర్  ఇక్కడే తన ప్రాణాలను కాపాడుకున్నాడని ప్రజలు అంటున్నారు. కాని హిట్లర్ 1945లోనే  మరణించినట్లు .. . అతని దంతాల నమూనా ద్వారా మరణం నిర్ధారించబడింది .ఆయన ఇక్కడ చాలాకాలం నివసించిన తరువాత అర్జెంటీనా పారిపోయి అక్కడే చనిపోయే వరకు గడిపాడని మరికొంతమంది అంటున్నారు. అయితే  బెర్లిన్​ లో నిర్మించిన బంకర్లో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని చరిత్రలో ఉంది.