ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో సోషల్ మీడియా ఉంది. ఎక్కడ ఏ మారు మూల ఎలాంటి ఘటన జరిగినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. అది వీడియో అయినా.. ఇమేజ్ అయినా షేర్ లు.. లైక్ లు పోస్ట్ లు.. కామెంట్లతో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు నెటిజన్లు. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతుంది. గాడిద గుడ్డు అంటారు. బంగారు బాతు గుడ్డు అంటారు. కానీ నిజంగానే బంగారు గుడ్లు ఉంటాయి. ఏ పక్షి అయినా బంగారు గుడ్డు పెడుతుందా..?అంటే ఎందుకు పెట్టవు అనేలాంటి ఓ ఘటన జరిగింది. ఫసిఫిక్ మహా సముద్రం అడుగున ఓ బంగారు గుడ్డు’ను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఆ బంగారు గుడ్డును ఏ జీవి పెట్టింది..?ఎప్పుడు పెట్టింది…? అనే దానికి గురించి ఏకంగా సముద్రాన్ని జల్లెడ పట్టేస్తున్నారు. పసిఫిక్ మహా సముద్రంలో బంగారు గుడ్డు మిస్టరీని ఛేదించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు సముద్ర శాస్త్రవేత్తల బృందం.
పసిఫిక్ మహా సముద్రంలో దక్షిణ అలాస్కా (Alaska)తీరంలో ఓ వింత వస్తువును గుర్తించారు శాస్త్రవేత్తలు. గుడ్డు ఆకారంలో ఉండే ఆ వింత వస్తువు బంగారం రంగులో ఉంది.దానికి ఓ వైపున రంధ్రం కూడా ఉంది. యూఎస్‌కు చెందిన సైంటిస్టులు సీస్కేప్ అలాస్కా (Seascape Alaska)యాత్రలో భాగంగా పసిఫిక్ మహా సముద్రంలో దాదాపు రెండు మైళ్ల లోతులో అంతరించిపోయిన అగ్నిపర్వతాన్ని (underwater volcano)అన్వేషిస్తున్న సమయంలో బంగారం రంగులో మెరిసిపోతున్న బంగారు గోళాన్ని కనుగొన్నారు. దీన్ని శాస్త్రవేత్తలు స్పూకీ గోల్డెన్ ఎగ్ (spooky golden egg)అని పిలుస్తున్నారు. అయితే ఈ బంగారు గుడ్డును అక్కడ జీవించే ఏదో ఒక జీవి పొదిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ‘బంగారు గుడ్డు’ మిస్టరీని ఛేదించే ప్రయత్నాల్లో సముద్ర శాస్త్రవేత్తల బృందం తలమునకలైంది.
రిమోట్-నియంత్రిత పరికరాలను ఉపయోగించి, శాస్త్రవేత్తల బృందం ఒక నమూనాను సున్నితంగా సేకరించారు. బంగారు కవచంలో దాగి ఉన్న ఈ భయంకరమైన వింత గుడ్డును ఏ జంతువు పెట్టి ఉంటుందో తెలుసుకోవడమే లక్ష్యంగా పరిశోధనలు చేస్తున్నారు. తమ పరిశోధనా చరిత్రలో ఇటువంటి వింత వస్తువును కనుగొనలేదని..ఇలాంటి వస్తువును తాము అస్సులు ఎప్పుడు చూడలేదని తెలిపారు. ఈ బంగారు గడ్డు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారయి. దీనిపై క్యూరియాసిటీ పెరిగిపోయింది. దీన్ని X-ఫైల్స్ ఎపిసోడ్ (X-Files episode)దృశ్యాలతో పోలుస్తున్నారు.