అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధ్యక్ష రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్, కమలాహారీస్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో రిపబ్లికన్ పార్టీ నేత డోనాల్డ్ ట్రంప్ పై వరుస హత్యాయత్నాలు కలవరం రేపుతున్నాయి. ట్రంప్ పై జరిగిన హత్యాయత్నాలపై ఎఫ్ బీఐ దర్యాప్తు చేస్తోంది. ఇదిలా ఉంటే.. ట్రంప్ కు మరో సమస్య వచ్చి పడింది. ఎన్నికల సమీపిస్తున్నందున ప్రచారం ముమ్మరం చేసిన ట్రంపు ర్యాలీలో కొందరు మద్దతుదారులు ఓ వింత అనారోగ్యానికి గురవడం చర్చనీయాంశమయింది.
అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా అరిజోనాలోని టక్సన్ ప్రాంతంలో డోనాల్డ్ ట్రంప్ ర్యాలీ నిర్వహించగా.. ఆయన మద్దుతుదారులు పెద్దు ఎత్తున పాల్గొన్నారు. అయితే ర్యాలీలో పాల్గొన్న 20 మంది సపోర్టర్స్ అనారోగ్యానికి గురయ్యారు. కంటి, చర్మ సమస్యలతో ఆస్పత్రులకు పరుగులు పెట్టారు. ట్రంప్ వెనకవైపు వేదికపై కూర్చున్నవారికి ఆరోగ్య సమస్యలు తలెత్తాయని.. దీని వెనక ఏదో కుట్ర ఉండి ఉండొచ్చని ..కెమికల్ అటాక్ ఏదైనా జరిగిండొచ్చని ట్రంప్ వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.