ఏం జరుగుతోంది: ఛత్తీస్‌గఢ్‌లో వింత వ్యాధితో 13 మంది మృతి.. ప్రతి ఇంట్లో ఒకరు బాధితులే..

ఏం జరుగుతోంది: ఛత్తీస్‌గఢ్‌లో వింత వ్యాధితో 13 మంది మృతి.. ప్రతి ఇంట్లో ఒకరు బాధితులే..

ఛత్తీస్ గఢ్ లో వింత వ్యాధి కలకలం రేపుతోంది.. ఈ అంతుచిక్కని వ్యాధితో ఇప్పటికే 13 మంది మృతి చెందగా 80 మంది బాధితులు ఉన్నట్లు సమాచారం. మళ్ళీ కరోనా రోజులను గుర్తు చేస్తున్న ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో వింత వ్యాధి వ్యాపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సదరు చిన్న గ్రామంలోని ప్రతి ఇంట్లో ఒక్కరు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించామని తెలిపారు అధికారులు.

ఈ వ్యాధితో ఇప్పటికే 13మంది మరణించగా.. మరో 80మందికి ఈ వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్నామని తెలిపారు అధికారులు. అనుమానితుల నుండి శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్ కు పంపమని.. రిపోర్ట్స్ రావాల్సి ఉందని తెలిపారు అధికారులు. అంతుచిక్కని వ్యాధి వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో గ్రామస్తులు భయాందోళనకు లోనవుతున్నారు.

వ్యాధి లక్షణాలు:

ఈ వింత వ్యాధి బారిన పడ్డ బాధితులు ఛాతీ నొప్పి, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారని.. ఆరోగ్యం కూడా క్షీణించిందని తెలిపారు అధికారులు. 

మహువా పంట సమయంతో పాటు వాతావరణంలో మార్పు, గ్రామస్తులు అడవుల్లోకి వెళ్లి రోజంతా మహువాను సేకరించటమే వ్యాధికి ప్రధాన కారణమని గ్రామంలో పర్యటిచిన ఆరోగ్య బృందాలు గుర్తిచాయని అన్నారు అధికారులు. వ్యాధితో బాధపడుతున్నప్పటికీ మహువాను సేకరించడానికి అడవులకు వెళ్లాలని బాధితులు పట్టుబడుతున్న క్రమంలో వారికి ఓఆర్ఎస్ ఇచ్చి పంపుతున్నామని తెలిపారు అధికారులు. 

ALSO READ | మరో ఇద్దరు భారతీయులను ఉరి తీసిన దుబాయ్ : లిస్టులో మరో 25 మంది