బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. గురువారం(జనవరి 16) తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఇంట్లోకి చొరబడిన ఓ ఆగంతకుడు పదునైన కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటీన కుటుంబసభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నటుడు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదంతా బాగానే ఉన్నా.. అత్యంత భద్రత ఉండే సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ఆగంతకుడు ఎలా చొరబడరనేది అంతుపట్టని విషయం.
12 అంతస్తుల భవనం..
సైఫ్ అలీఖాన్ కుటుంబం ముంబైలోని బాంద్రా వెస్ట్ ప్రాంతంలోని విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. 12 అంతస్తుల భవనమది. 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదు బెడ్‌రూమ్‌లు, వ్యాయామశాల, సంగీత గది, ఆరు టెర్రస్ బాల్కనీలు ఉన్నాయి. దాడి జరిగిన సమయంలో వంట పనుషులు కాకుండా 10 మంది సెక్యూరిటీ సిబ్బంది విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరు కాకుండా ముగ్గురు అతని ప్రత్యేక సిబ్బంది ఇంట్లోనే ఉన్నారు. ఇంత మంది ఉన్నా.. ఆగంతకుడు సైఫ్ అలీఖాన్ నే ఎందుకు టార్గెట్ చేశారనేది తేలాల్సిన విషయం.
Also Read :- నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి
ఆస్థి కోసమా..!
పటౌడీ కుటుంబంలో జన్మించిన సైఫ్ అలీ ఖాన్.. నటి షర్మిలా ఠాగూర్, క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ కుమారుడు. అతని పూర్వీకుల ఆస్తిని పటౌడీ ప్యాలెస్ అని పిలుస్తారు. ఈ ప్యాలెస్ గుర్గావ్‌లో ఉంది. 150 గదులతో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఆ ప్యాలెస్ విలువ సుమారు రూ. 800 కోట్లు. ఇక సైఫ్ అలీఖాన్ నికర ఆస్తుల విలువ కొస్తే.. రూ. 1200 కోట్లు. ఈ ఆస్థి కోసమే దాడి జరిగిందన్నది తెరమీదకు వస్తున్న ప్రశ్న. ఒకవేళ ఆగంతకుడు దొంగతనానికే వచ్చారనుకుంటే.. అత్యంత భద్రత ఉండే ఆ ఇంటిని ఎంచుకునేవాడే కాదన్నది అందరి మాట. ఒకసారి లోపలకి వెళ్లి తిరిగి బయటకు వెళ్లేంత వెసులుబాటు లేదట.
ఇవే కాదు, సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి వెనుక ఎన్నో ప్రశ్నలు మిస్టరీగా ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఇవే..
>>> సైఫ్ అలీఖాన్ ఉంటే ఇల్లు ముంబైలోని బాంద్రా ప్రాంతం.. భద్రతలో రాజీపడని ఏరియా.
>>> 12వ అంతస్తుల భవనం.. సైఫ్ అలీఖాన్ ఏ గదిలో ఉన్నారనేది మూడో కంటికి తెలియని విషయం.
>>> సైఫ్ అలీఖాన్ ఆషామాషీ వ్యక్తి కాదు.. రాజవంశానికి చెందిన వ్యక్తి.. అంతే కాకుండా పెద్ద సినీ సెలబ్రిటీ
>>> ఇంటికి ఎప్పుడూ టైట్ సెక్యూరిటీ ఉంటుంది.. ఇంట్లో పెద్ద సంఖ్యలో పనోళ్లు ఉంటారు..
>>> ఆయన ఇంట్లోకి వెళ్లటానికి 5, 10 దారులు ఏమీ లేవు.. అపార్ట్ మెంట్ లోకి వెళ్లాలంటనే సవాలక్ష ప్రశ్నలు అడిగే సెక్యూరిటీ ఉంటుంది.. ఆ అపార్ట్ మెంట్ లో అందరూ పెద్ద పెద్ద ధనవంతులు.. సో.. అపార్ట్ మెంట్ లోకి ఎంట్రీ అంత ఈజీ కాదు..
>>> అంత పెద్ద టైట్ సెక్యూరిటీ ఉంటే అపార్ట్ మెంట్ లోకి వెళ్లటమే కాకుండా.. 12వ అంతస్తు వరకు ఆ ఆగంతకుడు ఎలా వెళ్లాడు అనేది మిస్టరీగా ఉంది.. పోలీసులు కూడా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పటం లేదు..
>>> అర్థరాత్రి 2 గంటల 30 నిమిషాలకు దాడి జరిగింది అంటున్నారు.. 12వ అంస్తులోని సైఫ్ అలీఖాన్ ఫ్లాట్ లోకి ఆ ఆగంతకుడు వెళ్లాడు అంటే.. తలుపులు ఎవరు తీశారు.. ఎలా తీశారు.. ఎలా ప్లాట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.. దీనిపై ఎవరూ నోరు విప్పటం లేదు.
>>> 12వ అంతస్తులోని అత్యంత ఖరీదైన.. వందల కోట్ల విలువైన ప్లాట్ అది.. అర్థరాత్రి తర్వాత అంత పెద్ద గొడవ జరిగి.. సైల్ అలీఖాన్ కూడా నిద్ర లేచారు అంటే.. మిగతా వాళ్లు ఏం చేస్తున్నారు.. అసలు ఆ టైంలో ప్లాట్ లో ఎవరెవరు ఉన్నారు.. అతని భార్య కరీనాకపూర్, పిల్లలు ఉన్నారా లేదా.. ఈ విషయంపై క్లారిటీ లేదు.
>>> అర్థరాత్రి 2 గంటల 30 నిమిషాలకు దాడి జరిగింది అని పోలీసులు చెబుతుంటే.. 3 గంటల 30 నిమిషాలకు లీలావతి ఆస్పత్రిలో ఆపరేషన్ చేశారు డాక్టర్లు.
>>> సైఫ్ అలీఖాన్ చేతికి గాయం అయినట్లు భార్య కరీనాకపూర్ చెబుతుంటే.. డాక్టర్లు మాత్రం వెన్నుముక దగ్గర బలమైన గాయం అయినట్లు చెబుతున్నారు.. ఈ ఇద్దరిలో ఎవరి వెర్షన్ కరెక్ట్.
>>> సైఫ్ అలీఖాన్ పై అంత పెద్ద దాడి చేసిన తర్వాత.. వచ్చినోళ్లు.. పొడిచినోడు మళ్లీ తిరిగి ఎలా వెళ్లిపోయాడు.. ఎవరూ పట్టుకోలేదా.. కేకలు వేయలేదా.. చుట్టుపక్కల వాళ్లను అలర్ట్ చేయలేదా.. అపార్ట్ మెంట్ సెక్యూరిటీకి సమాచారం ఇవ్వలేదా.. ఆగంతకుడి వెనక ఎవరూ పరిగెత్తలేదా.. ఇలా ఎన్నో ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి.