
కర్నాటక రాష్ట్రంలో జరిగిన ఓ ఫ్యామిలీ మరణాలు దేశాన్ని షాక్‌కు గురి చేశాయి. విదేశాల్లో ఉద్యోగం చేసిన అనుభవం.. ఐటీ ఉద్యోగి.. ఆస్థిపాస్తులు భారీగా ఉన్నాయి. కన్సల్టెన్సీ పెట్టి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు. విదేశాల్లో స్థిరపడిన సోదరులు.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లు ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. అలాంటి విషయమే ఎవరికీ తెలియదు. ఇలా ఏ కోణంలోనూ ఈ మరణాలకు ఇదీ అని స్పష్టమైన కారణాలు కనిపించకపోయినా.. ఆ వ్యాపారవేత్త తన భార్య, కొడుకు, తల్లిని చంపిన విధానం మాత్రం భయానకంగా ఉంది. ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్న విధానం సైతం పోలీసులను భయాందోళనలకు, షాక్‌కు గురి చేశాయి. మైసూర్ ఫ్యామిలీ మరణాలపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దక్షిణ మైసూరులోని రెండు అపార్ట్‌మెంట్లలో సోమవారం తెల్లవారుజామున ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులను వ్యాపారవేత్త చేతన్, ఆయన భార్య రూపాలి (43), వారి 15 ఏళ్ల కుమారుడు కుశాల్, చేతన్ తల్లి ప్రియంవద (65) గా గుర్తించారు. వీరు ఒక్కొక్కరు ఒక్కోలా మృతి చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కుటుంబ పెద్ద చేతన్ తల ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి వేలాడుతూ కనిపించగా, అతని కుమారుడు కుశాల్ కాళ్ళు తాళ్లతో కట్టేసి గొంతు కోసి చంపబడి కనిపించాడు. భార్య రూపాలి (43) ఒంటిపై ఆరేడు కత్తి పోట్లతో రక్తపు మడుగులో పడి ఉంది. మరొక అపార్ట్‌మెంట్ చేతన్ తల్లి ప్రియంవద (62) గొంతు కోసి అచేతనంగా పడి ఉంది.
సోమవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకునే ముందు చేతన్ వారందరినీ నిద్రలోనే చంపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదయాన్నే చేతన్ అత్తమామలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. హత్య చేసే ముందు వ్యాపారవేత్త.. అమెరికాలో ఉంటున్న అతని సోదరుడు భరత్‌కు ఫోన్ చేసి, మైసూరులోని చేతన్ అత్తమామలకు సమాచారం అందించాడని చెప్తున్నారు.
ఎవరీ చేతన్..?
చేతన్ హసన్‌లోని గోరూర్ అనే గ్రామానికి చెందినవాడు. 2019లో మైసూరుకు తిరిగి రాకముందు దుబాయ్‌లో ఇంజనీర్‌గా పనిచేశాడు. తిరిగొచ్చిన తర్వాత.. మైసూరులో ఉద్యోగ కన్సల్టెన్సీ పెట్టాడు. ఉన్నత చదువులు వారిని దుబాయ్‌లోని పలు సంస్థల్లో ఉద్యోగాలు పొందేందుకు సహాయం చేశాడు. అటువంటి అతని కుటుంబం అనుమానాస్పద రీతిలో మృతిచెందండం పలు అనుమానాలకు తావిస్తోంది. వీరిని ఎవరైనా హత్య చేశారా..? అన్న కోణంలోనూ ధర్యాప్తు చేస్తున్నారు.