Pushpa 2 OTT Release Update: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప 2: ది రూల్ సినిమా డిసెంబర్ 05న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయిన రోజునుంచి ఇప్పటివరకూ రోజుకో రికార్డ్ ని బ్రేక్ చేస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో అత్యంత ఫాస్ట్ గా రూ.1500 కోట్లు కలెక్ట్ చేసిన తోలి ఇండియన్ సినిమాగా రికార్డుల క్రియేట్ చేసింది.
అయితే గత రెండు రోజులుగా పుష్ప 2 ఓటిటి రిలీజ్ పై పలు వార్తలు బలంగా వైరల్ అవుతున్నాయి. దీంతో పుష్ప 2 నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా పుష్ప 2 ఓటిటి రిలీజ్ పై రూమర్స్ వినిపిస్తున్నాయని అందులో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు. అలాగే ఈ సెలవుల్లో పుష్ప 2 సినిమాని థియేటర్లలో చూసి ఎంజాయ్ చెయ్యండని సూచించారు. ఇక పుష్ప 2 సినిమాని 56 రోజుల తర్వాత ఓటిటిలో రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు. దీంతో పుష్ప ఓటిటి రూమర్స్ పై పులిస్టాప్ పడింది. దీన్నిబట్టి చూస్తే వచ్చే ఏడాది జనవరి నెల చివరి వారంలో లేదా ఫిబ్రవరిలో పుష్ప 2 ఓటిటి రిలీజ్ ఉండేలా అవకాశం ఉంది.
Also Read :- దెబ్బకి 100 ఏళ్ళ హిందీ బాక్సాఫీస్ రికార్డులన్నీ బ్రేక్..
అయితే పుష్ప 2 కి క్రిస్మస్ తో పాటూ సంక్రాంతి కూడా కలసివచ్చేలా కనిపిస్తోంది. కాగా ఈ సినిమా రిలీజ్ అయ్యి 15 రోజులు పూర్తయినప్పటికీ ఇప్పటికీ నార్త్ లో పెద్దమొత్తంలో కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతోంది. హిందీలో అత్యధికంగా రూ.632 కోట్లు(నెట్) కలెక్ట్ చేసింది. దీంతో బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మొదటి సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ కారణంగానే మేకర్స్ పుష్ప 2 ని 56 రోజుల తర్వాత ఓటిటిలో రిలీజ్ చేసే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ విషయం ఇలా ఉండగా "పుష్ప 2: ది రూల్" సినిమా ఓటిటి హక్కులని ప్రముఖ నిర్మాణ సంస్థ, ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇందుకోసం దాదాపుగా రూ.175 కోట్లు బడ్జెట్ వెచ్చించినట్లు సమాచారం.
There are rumours floating around about the OTT release of #Pushpa2TheRule
— Mythri Movie Makers (@MythriOfficial) December 20, 2024
Enjoy the Biggest Film #Pushpa2 only on the Big Screens in this Biggest Holiday Season ❤️
It won't be on any OTT before 56 days!
It's #WildFirePushpa only in Theatres Worldwide 🔥