Pushpa2TheRule: పుష్ప 2 అప్డేట్..పుష్పరాజ్ మాస్ జాతర ప్రారంభం 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప ది రూల్(Pushpa The Rule). క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. పుష్ప 2 సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. ఆల్రెడీ సెకండ్ పార్ట్ గ్లింప్స్, పోస్టర్ రిలీజ్ అయ్యి అంచనాలు అమాంతం పెంచేశాయి. 

లేటెస్ట్గా పుష్ప 2 నుంచి అదిరిపోయే అప్డేట్ వస్తోందని అనౌన్స్ చేశారు మేకర్స్. "రేపు (ఏప్రిల్ 2న) పుష్ప మాస్ జాతర ప్రారంభం..ఎక్సయిటింగ్ ప్రకటన లోడ్ అవుతోంది..చూస్తూనే ఉండండి" అంటూ ఫ్యాన్స్ లో అలజడి మొదలెట్టేశారు మేకర్స్. దీంతో రేపు పుష్ప 2 నుంచి ఎలాంటి అప్డేట్ రానుందో అని ఈ క్షణం నుంచే ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. 

అయితే పుష్ప 2 టీజర్ త్వరలో రాబోతున్నట్లు సమాచారం. రీసెంట్గా ఓ నెటిజన్‌ పుష్ప-2 అప్‌డేట్‌ గురించి సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఎక్స్‌క్యూటివ్ ప్రొడ్యూసర్ శరత్‌ని ప్రశ్నించగా..వారి ట్వీట్‌కు రెస్పాన్స్ ఇస్తూ పుష్ప టీజర్ అప్‌ డేట్‌ ఇచ్చేశాడు. అదేంటంటే..త్వరలో అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా (ఏప్రిల్ 8న) టీజర్ వస్తుందని రిప్లై ఇచ్చాడు. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ మస్తు ఖుషి అయ్యారు. ఇక మేకర్స్ నుంచి అనౌన్స్ మెంట్ వస్తుందని తెలుపడంతో 'టీజర్ అప్డేట్ వస్తుంది..ఫ్యాన్స్ ఫుల్ వెయిటింగ్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

పుష్ప ఫస్ట్ పార్ట్ లో మొత్తం జీరో స్థాయి నుంచి స్మగ్లర్ గా మారిన అల్లు అర్జున్ కు..ఇక పుష్ప 2లో స్మగ్లర్ గా ప్రపంచాన్ని ఎలా రూల్ చేశాడో చూపించబోతున్నా అల్లు అర్జున్ కు తేడా తెలుసుకోవడానికి అందరు ఎదురుచూస్తున్నారు.

అంతేకాకుండా..సుకుమార్ క్రియేటివ్ ఐడియాస్..అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ అంచనాల దృష్ట్యా..సినిమా హక్కులను సొంతం చేసుకోవడానికి తగ్గేదేలే అన్నట్టు నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.