తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు అండగా నిలిచేందుకు టాలీవుడ్ బడా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ముందుకొచ్చింది. ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు రూ. 50లక్షల విరాళాన్ని ప్రకటించింది.
ఈ ఆపద సమయంలో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలకు మా వంతు సాయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు చెరో రూ.25 లక్షలు విరాళంగా ఇస్తున్నాం. మనం కలిసి ఈ కష్ట సమయాలను అధిగమించాలి. బాధిత ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, త్వరగా సాధారణ స్థితికి రావాలని ఆశిస్తున్నాము అని తెలిపింది.
ALSO READ | Pawan Kalyan: వరద బాధితులకు అండగా పవన్..తెలుగు రాష్ట్రాలకు రూ.6 కోట్ల భారీ విరాళం
‘గడిచిన వారం రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ ఆస్తి నష్టం కూడా జరిగింది. ఈ ఆపద సమయంలో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలకు మా వంతు సాయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ.50లక్షలు విరాళంగా ఇస్తున్నాం. ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు త్వరగా కోలుకోవాలి. బాధిత కుటుంబాలు సాధారణ స్థితికి రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం’’ అంటూ మైత్రి నిర్మాణ సంస్థ ట్విట్టర్ X ద్వారా పోస్ట్ పెట్టింది.
We shall together get through these tough times.
— Mythri Movie Makers (@MythriOfficial) September 6, 2024
Wishing for a speedy recovery of the affected and hoping normalcy is restored soon. pic.twitter.com/EI5WRaq91G
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్స్ అంటే మైత్రి మూవీ మేకర్స్ అనే చెప్పాలి. ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్స్ అందరితోను వీళ్ళు సినిమాలు చేస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. కేవలం తెలుగులోనే కాదు తమిళ, హిందీ మార్కెట్ లో కూడా సూపర్ ప్రాజెక్ట్స్ ను సెట్ చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్.