
హైదరాబాద్ సిటీ, వెలుగు: అమ్మాయిలు పీరియడ్స్ గురించి అపోహలు, మూఢనమ్మకాలు వీడాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మంగళవారం అంబర్ పేట్ నియోజకవర్గంలోని ఆజంపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యంగిస్తాన్ ఫౌండేషన్ ద్వారా గర్ల్స్ టాయిలెట్ లో నాప్కిన్ దహన యంత్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యంగిస్తాన్ ఫౌండేషన్ గర్ల్స్ కోసం ఇన్సినరేటర్(నాప్కిన్ దహన యంత్రం) ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ యంత్రాన్ని గర్ల్స్ ప్రతి ఒక్కరూ వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఆజంపుర స్కూల్లో హెల్త్ క్లబ్ ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమన్నారు. స్కూల్లో హెల్త్ క్లబ్ అంబాసిడర్‌కు శాలువా కప్పి కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో డీఈఓ ఆర్.రోహిణి, ప్రత్యేక అధికారి జీఎం ఇండస్ట్రీస్ పవన్ కుమార్, డిప్యూటీ ఐఓఎస్ నిజాముద్దీన్, డిప్యూటీ ఈవో విజయ, హెచ్ఎం వెంకట్ రెడ్డి, తహసీల్దార్ వీరాబాయి, యంగిస్తాన్ ఫౌండేషన్ అరుణ్ ఎలమటి, టీఐసీ కృతిక, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.