
హైదరాబాద్, వెలుగు: విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ఎన్.శ్రీధర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయనకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులిచ్చారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన కొనసాగుతారని పేర్కొన్నారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న బుర్రా వెంకటేశంను ప్రభుత్వం టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన వాలంటరీ రిటైర్‌మెంట్‌కు ప్రభుత్వం అనుమతించింది. ఈ నేపథ్యంలో వెంకటేశం స్థానంలో ఎన్.శ్రీధర్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.