Naanaa Hyraanaa Song: రామ్ చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్... నేటి నుంచి థియేటర్స్ లోకి నానా హైరానా సాంగ్..

మెగా హీరో రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అయింది. ప్యాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజే దాదాపుగా రూ.186 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది. పొలిటికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమాలోని పాటలకోసమే దాదాపుగా రూ.75 కోట్లు కానీ పలు టెక్నీకల్ సమస్యల కారణంగా సినిమా నుంచి తొలగించారు.

దీంతో ఆదివారం నుంచి గేమ్ఛేంజర్ సినిమాలో ‘నానా హైరానా' సాంగు యాడ్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే ఇవాల్టి నుంచి థియేటర్లలో ఈ పాటతో కూడిన ప్రింట్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. తొలుత 14వ తేదీన సాంగ్ యాడ్ చేస్తామని తెలుపగా రెండు రోజుల ముందే వచ్చేసింది. అయితే ఈ పాట లిరికల్ సాంగ్ కి యూట్యుబ్ లో మంచివో రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇంతమంన్చి సాంగ్ సినిమాలో లేకపోవడంపై సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేయడంతో మేకర్స్ వెంటనే యాడ్ చేసినట్లు తెలుస్తోంది.

ALSO READ | Game Changer Box Office: అఫీషియల్.. గేమ్ ఛేంజర్ డే 1 బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?

ఈ విషయం ఇలా ఉండగా గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ కు జోడిగా కియారా అద్వాణీ, అంజలి నటించారు. ప్రముఖ డైరెక్టర్, నటుడు ఎస్ జే సూర్య విలన్ పాత్రలో నటించగా శ్రీకాంత్, సునీల్, జయరాం(మలయాళ నటుడు), రాజీవ్ కనకాల, బ్రహ్మానందం తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.