హైదరాబాద్‌‌లో మిల్లెట్స్ కాన్‌‌క్లేవ్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు :  చిరుధాన్యాల ( మిల్లెట్స్‌‌) వినియోగం పెంచేందుకు, వీటి ఇంపార్టెన్స్‌‌ను ప్రజలకు తెలియజేసేందుకు నాబార్డ్‌‌ ‘మిల్లెట్‌‌ కాన్‌‌క్లేవ్‌‌ 2023’ ని శుక్రవారం హైదరాబాద్‌‌లో నిర్వహించింది. చిరు ధాన్యాలను పండించడం నుంచి ఎగుమతులు చేయడం, హెల్త్‌‌, న్యూట్రిషన్ వంటి అంశాలపై ఎక్స్‌‌పర్ట్‌‌లు, స్టేక్ హోల్డర్లు ఈ కాన్‌‌క్లేవ్‌‌లో మాట్లాడారు. గ్లోబల్‌‌గా ఉత్పత్తి అవుతున్న చిరు ధాన్యాల్లో 41 శాతం ఇండియా నుంచే ఉందని నాబార్డ్‌‌ చైర్మన్‌‌ కే వీ షాజి అన్నారు.

ALSO READ: ఇంటి లోన్​తో పాటే సోలార్​ ప్యానెళ్లు

మిల్లెట్స్ వాల్యూ చెయిన్‌‌ను డెవలప్ చేయడానికి నాబార్డ్‌‌, ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. రూరల్‌‌, అర్బన్‌‌ ప్రాంతాల్లో ఇన్‌‌కమ్‌‌ లెవెల్స్‌‌ మధ్య తేడాను తగ్గించడంపై ఫోకస్ పెట్టామని చెప్పారు. చిరుధాన్యాల పంటలు  వేయడంపై రైతులను నాబార్డ్  ప్రోత్సహిస్తోంది. అలానే చిరు ధాన్యాలను తినడం వలన చాలా హెల్త్‌‌ బెనిఫిట్స్ ఉన్నాయని ప్రజలకు అవగాహన కలిపిస్తోంది.