గ్లామర్ రోల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నభా నటేష్.. ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. తాజాగా పాన్ ఇండియా మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు రివీల్ చేశారు మేకర్స్. నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘స్వయంభూ’ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుందని తెలియజేస్తూ తన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చీర కట్టుకుని, నగలతో యువరాణిలా మెరిసిపోతూ కనిపిస్తున్న ఆమె గెటప్ ఇంప్రెస్ చేస్తోంది.
అలాగే ‘స్వయంభూ’ వరల్డ్‌లోకి వెల్‌కమ్ అంటూ రిలీజ్ చేసిన వీడియోలో ఆమె ఈ పాత్రకోసం చేసిన ట్రాన్స్‌ఫర్మేషన్ ఆకట్టుకుంది. నభా ట్రెడిషినల్ లుక్‌లో ఉన్న ఈ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో నభా నటేష్ కీలకమైన, శక్తివంతమైన పాత్రను పోషిస్తోందని మేకర్స్ చెప్పారు. ఇప్పటికే ఈ మూవీలో సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మరో హీరోయిన్‌గా నభా నటేష్ కనిపించనుంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో భువన్ , శ్రీకర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంగా జరుగుతోంది. మరోవైపు ప్రియదర్శి హీరోగా నటిస్తున్న చిత్రంలో నభా నటేష్ ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది.