Upper Circuit: నెలలో ఇన్వెస్టర్ల డబ్బు డబుల్.. క్రేజీ స్టాక్ ఇవాళ 5% అప్, మీ దగ్గర ఉందా?

Upper Circuit: నెలలో ఇన్వెస్టర్ల డబ్బు డబుల్.. క్రేజీ స్టాక్ ఇవాళ 5% అప్, మీ దగ్గర ఉందా?

NACL Industries Shares: దాదాపు రెండు నెలల కాలం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదొడుకులతో పోరాడుతున్నాయి. ఈ క్రమంలో రిటైల్ పెట్టుబడిదారుల సంపదను చాలా స్టాక్స్ మింగేసిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి ప్రతికూల మార్కెట్ పరిస్థితుల్లోనూ పెట్టుబడిదారుల డబ్బును 133 శాతం పెంచిన ఒక స్మాల్ క్యాప్ కంపెనీ షేర్లు ఇప్పుడు మార్కెట్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇటీవలి కాలంలో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలోని చాలా కంపెనీ షేర్లు కరెక్షన్ చూసినప్పటికీ.. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ఎన్ఏసీఎల్ ఇండస్ట్రీస్ షేర్లు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించాయి. కంపెనీ ప్రధానంగా అగ్రి కెమికల్స్ వ్యాపారంలో నిమగ్నమై ఉంది. స్మాల్ క్యాప్ స్టాక్ ధర నేడు 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకటంతో ఇంట్రాడేలో కంపెనీ షేర్ల ధర రూ.156.55కి చేరుకుంది. దీంతో కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.

గడచిన నెల రోజుల వ్యవధిలో ఎన్ఏసీఎల్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు 133 శాతం పెరుగుదలతో ఇన్వెస్టర్లపై డబ్బుల వర్షం కురిపించింది. ఈ కాలంలో కంపెనీ షేర్ల ధర ఒక్కోటి రూ.67 స్థాయిల నుంచి ప్రస్తుతం రూ.156కి చేరుకున్నాయి. అయితే ఈ భారీ స్టాక్ దూకుడుకి కీలక కారణం ఒకటి ఉంది. మురుగప్ప గ్రూప్ అగ్రి కెమికల్స్ కంపెనీ కోరమండల్ ఎన్ఏసీఎల్ కంపెనీలో 53 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు కీలక ఒప్పందం గతనెల 12న కుదుర్చుకోవటంతో స్టాక్‌లో మెగా ర్యాలీ మెుదలైంది. కోరమాండల్ ఇంటర్నేషనల్ ఒక్కో షేరుకు రూ.76.70 చొప్పున కొనుగోలు చేపడుతోంది. ఈ కొనుగోలు మెుత్తం విలువ రూ.820 కోట్లుగా ఉండనుంది. 

స్టాక్ గత పనితీరు..
దీర్ఘకాలికంగా కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు ఈ కంపెనీ షేర్ల నుంచి మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందుకున్నారు. ఐదేళ్ల కాలంలో కంపెనీ తన పెట్టుబడిదారులకు 566 శాతం రాబడిని తెచ్చిపెట్టింది. 2020 ఏప్రిల్ 9న కంపెనీ షేర్ల ధర ఒక్కోటి రూ.23.50 వద్ద ఉండగా ప్రస్తుతం అది రూ.156 స్థాయిలకు చేరుకోవటం గమనార్హం. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.