
హైదరాబాద్: ప్రముఖ అంతర్జాతీయ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్పై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(NADA) సస్పెన్షన్ వేటు వేసింది. రమేష్ దగ్గర కోచింగ్ తీసుకున్న ఇద్దరు క్రీడాకారులు డోప్ టెస్ట్ కు నిరాకరించారు. డోప్ టెస్ట్ కు షాంపిల్స్ ఇవ్వకుండా దాటవేశారు. దీంతో వారికి కోచ్ గా ఉన్న నాగపురి రమేష్ పై వేటు పడింది. రమేష్ కు ద్రోణాచార్య అవార్డు పొందారు.నాగపురి రమేష్ కోచ్ గా అంతర్జాతీయ ప్లేయర్స్ దుతి చంద్, పారా ఒలంపియాన్ జీవంజీ దీప్తి, నందిని వంటి దిగ్గజ క్రీడాకారులను తీర్చిదిద్దారు. డోపింగ్ వ్యవహారంలో నాగపురి రమేష్ తో పాటు మరో ఇద్దరు అసిస్టెంట్ కోచ్ లపైనా సస్పెన్షన్ వేటు పడింది.
మరోవైపు క్రీడాకారులు పరాస్ సింఘాల్, పూజారాణి, నలుబోతు షణ్ముగ శ్రీనివాసులు, చెలిమి ప్రతుష, శుభం మహారా, కిరణ్ ,జ్యోతితో సహా ఏడుగురు అథ్లెట్లు డోపింగ్ పరీక్షలను తప్పించుకున్నారనే ఆరోపణలతో సస్పెన్షన్ ఎదుర్కొంటున్నారు. కోచ్ నాగ్‌పురి అథ్లెట్లు పరీక్షలను తప్పించుకోవడానికి సహాయం చేశాడని ఆరోపణలు ఉన్నాయి.
రమేష్ నాగ్‌పురి హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) కేంద్రంలో పనిచేస్తున్నాడు. 2023లో ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగ్‌పురిని జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (AFI) జూనియర్ చీఫ్ కోచ్‌గా నియమించింది. NADA యాంటీ-డోపింగ్ రూల్స్, 2021లోని ఆర్టికల్ 2.9 ప్రకారం అతనిపై సస్పెన్షన్ విధించబడింది.