ఫ్రెంచ్ ఓపెన్లో నాదల్ జోరు

ఫ్రెంచ్ ఓపెన్లో స్పెయిన్ స్టార్ రఫెల్ నాదల్ మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. రెండో రౌండ్లో అతను ఫ్రెంచ్ ఆటగాడు కోరెంటిన్ మౌటెట్పై వరుస సెట్లలో గెలుపొందాడు.  ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో 6-3, 6-1, 6-4 స్కోరు తేడాతో  విజయం సాధించాడు.  ఈ గెలుపుతో గ్రాండ్ స్లామ్లలో  300ల విజయాలు సాధించిన మూడవ ఆటగాడిగా నాదల్ చరిత్రకెక్కాడు. ఇతని కంటే ముందు 369 విజయాలతో ఫెదరర్ నెంబర్ వన్ ప్లేస్లో కొనసాగుతుండగా, జకోవిచ్ 324 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు. 2005లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ ఆడిన నాదల్.. ఇప్పటి వరకు 107 మ్యాచులను గెలిచాడు. మొత్తంగా 13 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీలను సొంతం చేసుకున్నాడు. కేవలం మూడు మ్యాచులను మాత్రమే నాదల్ కోల్పోయాడు. ఇక తర్వాతి మ్యాచ్లో నాదల్..డచ్ ప్లేయర్ బోటిక్ వాన్ డి జాండ్‌స్చుల్ప్తో తలపడనున్నాడు. 

మరిన్ని  వార్తల కోసం..

ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌లో దూసుకుపోతున్న జొకోవిచ్

మూఢనమ్మకాలు నమ్మేవాళ్లు తెలంగాణను ఉద్ధరించలేరు