రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం బలహీనమైన లోక్ సభ స్థానాలపై బీజేపీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈనెల 27,28వ తేదీల్లో తమిళనాడు, ఒడిశాలో పర్యటించనున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ పట్టు కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఒడిశాలోని కంధమాల్, పూరీ... తమిళనాడులోని నీలగిరి, కోయంబత్తూర్లో నడ్డా పర్యటించనున్నారు.
ఈ పర్యటనలో మండల, బూత్ అధ్యక్షులను కలవనున్నారు. ఇతర సంస్థాగత సమావేశాలు కూడా నడ్డా షెడ్యూల్లో ఉన్నాయి. ఇక వచ్చే లోక్ సభ ఎన్నికలకు ముందు బలహీనంగా ఉన్న 144 లోక్ సభ స్థానాలపై బీజేపీ దృష్టి సారించింది. అది ఇప్పుడు 160 సీట్లకు విస్తరించడంతో... బూత్ ల పటిష్టత, పార్టీ నేతల సంఖ్యను పెంచడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలపై బీజేపీ దృష్టి సారించింది.