![అతను అలా అన్నప్పుడు చాలా బాధపడ్డా : నాదెండ్ల భాస్కరరావు](https://static.v6velugu.com/uploads/2023/01/Nadendla-Bhaskara-Rao-sensational-comments_xbBW59OHPf.jpg)
తనని మాజీ సీఎం అనొద్దని నాదెండ్ల భాస్కరరావు అన్నారు. ప్రస్తుతం తాను తాను బీజేపీ కార్యకర్తనని చెప్పారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, మాజీ గవర్నర్ మర్రి చెన్నారెడ్డి 103 వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద మర్రి చెన్నారెడ్డి రాక్ గార్డెన్లో ఆయన జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నాదెండ్ల.. ఈ మధ్య తాను బీజేపీ స్టేట్ ఆఫీస్ కు వేళ్తే ఒకతను తనని ఆంధ్రావాడని అన్నాడని, అలా అన్నప్పుడు తానెంతో బాధపడ్డానని నాదెండ్ల చెప్పారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారిలోముందుగా తెలంగాణ వాళ్ళందరూ మాట్లాడాక తాను మాట్లాడుతానని నాదెండ్ల అన్నారు.
ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు నాదెండ్ల సమాధి వద్ద నివాళులర్పించారు. ఉమ్మడి ఏపీ రాజకీయాలపై చెన్నారెడ్డి చెరగని ముద్ర వేశారు. రెండు సార్లు ముఖ్యమంత్రి పదవినే కాకుండా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, తమిళనాడు, పాండిచ్చేరి గవర్నర్‌గా కూడా పనిచేశారు. 1996 డిసెంబర్ 2న చెన్నారెడ్డి తుదిశ్వాస విడిచారు.