యాదాద్రి భువనగిరి జిల్లా: మాజీ కౌన్సిలర్, నయిమ్ ప్రధాన అనుచరుడు ఎండి నాసర్ మృతి చెందాడు. కొంత కాలంగాా అనారోగ్యంతో బాధపడుతున్న నాసర్ హైదరాబాద్ నగరంలోన ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స ఫలించక ఇవాళ మృతి చెందాడు. నయిమ్ కేసులలో నాసర్ కూడ సహ నిందితుడు. పలు కేసుల్లో ఇతనిపై పీడీ యాక్టు కూడా నమోదు అయింది. నయీమ్ తో కలసి పలు సెటిల్మెంట్లు, పంచాయతీలు చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. అలాగే భూముల లావాదేవీల్లో కూడా నిందితుడుగా ఉన్నాడు. నయిమ్ అక్రమ ఆస్తుల కేసులు, భూ కబ్జాలు, బెదిరింపుల కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు.
ఇవి కూడా చదవండి..
వెదురు సాగుకు ఎదురుదెబ్బ..రాష్ట్ర వాటా చెల్లించని సర్కారు