
నర్సాపూర్,వెలుగు : నర్సాపూర్ మున్సిపల్ ఇన్‌చార్జి చైర్మన్ గా నయీమొద్దీన్సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బీఆర్ఎస్ కు చెందిన 9 మంది కౌన్సిలర్లు అడిషనల్ కలెక్టర్ రమేశ్ ను కలిసి అవిశ్వాసం నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీ యాదవ్ అవిశ్వాసానికి ముందే తన పదవికి రాజీనామా చేశారు.
కలెక్టర్ రాజీనామాను ఆమోదించడంతో వైస్ చైర్మన్ గా ఉన్న నయీమొద్దీన్ ఇన్‌చార్జి చైర్మన్ గా నియమిస్తూ ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చాయి. మున్సిపల్ కమిషనర్ వెంకట్ గోపాల్ వైస్ చైర్మన్ గా ఉన్న నయీమొద్దీన్కు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. కౌన్సిలర్లు, స్థానిక నాయకులు ఆధ్వర్యంలో బాధ్యతలు స్వీకరించగా మాజీ చైర్మన్ మురళీ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.