కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్.. అప్పటిదాకా ఆగాలంటూ..

కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్.. అప్పటిదాకా ఆగాలంటూ..

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ఇటీవలే డైరెక్టర్ నాగ్ అశ్విన్ గతంలో తాను దర్శకత్వం వహించిన "ఎవడే సుబ్రహ్మణ్యం" సినిమా రీ రిలీజ్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు. ఇందులోభాగంగా కల్కి 2898 AD పార్ట్ 2 గురించి స్పందించాడు.

ఈ క్రమంలో కల్కి పార్ట్ 2 ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలిపాడు. ఇందులో సుమతి (దీపికా పదుకొనే), అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) క్యారెక్టర్స్ కి సంబందించిన స్టోరీ నేరేషన్ జరుగుతోందని ఇది కంప్లీట్ కాగానే సెట్స్ మీదకి తీసుకెళతామని చెప్పుకొచ్చాడు. సెకెండ్ పార్ట్ లో ప్రభాస్ క్యారెక్టర్ లెంగ్త్ ఎక్కువగా ఉంటుందని, ఇది ప్రధానంగా కర్ణ మరియు అశ్వత్థామ పాత్రల చుట్టూ తిరుగుతుందని తెలిపాడు. ఇక షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయం గురించి కూడా స్పందిస్తూ ఈ ఏడాది చివరిలో డిసెంబర్ నెలలో మొదలవుతుందని హింట్ ఇచ్చాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అవుతున్నారు.

Also Read :- థియేటర్స్ లో వర్కౌట్ కాలేదు కానీ అందులో బాగానే చూస్తున్నారట

అయితే గత ఏడాది జూన్ లో రిలీజయిన కల్కి 2898 AD మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ దాదాపుగా రూ.1120 కోట్లు కలెక్ట్ చేసింది. తమిళ్ స్టార్ హీరో కమల్ హాసన్ విలన్ గా నటించగా బాలీవడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, తదితరులు నటించారు. ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అయింది.