పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ కల్కి 2898 AD(Kalki 2898AD). టాలీవుడ్ క్రియేటీవ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag ashwin) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ భారీగా నిర్మిస్తున్నారు. ఇపుడు ప్రభాస్ సలార్ మూవీ సక్సెస్తో సంబరాల్లో మునిగిపోయాడు. ప్రభాస్ వరుస మూడు ప్లాప్స్ తర్వాత సలార్ తో సాలిడ్ సక్సెస్ రావడంతో..ఫ్యాన్స్ కూడా కాలర్ ఎగరేస్తున్నారు.
లేటెస్ట్గా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ని డబుల్ చేసేందుకు కల్కి టీమ్ ఓ ఆసక్తికర అప్డేట్ ఇచ్చింది. ప్రభాస్ సలార్ మూవీ తర్వాత వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతున్న మూవీ కల్కి 2898 AD. దీంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ IIT బాంబే Tech Fest 23 లోపాల్గొనబోతున్నారు. రేపు డిసెంబర్ 29న మధ్యాహ్నం గం.1:30 నిమిషాలకు కన్వెన్షన్ హాల్లో ఈ మీట్ జరగనుంది.
The Director of #Kalki2898AD, the Biggest Mytho Sci fi film of INDIA @nagashwin7 is set to have a conversation regarding the Technology involved in the film tomorrow at
— Techfest, IIT Bombay (@Techfest_IITB) December 28, 2023
?Convocation Hall
? 1:30 pm
?️ 29th December pic.twitter.com/5BzPiSdkzy
ఇదే విషయాన్ని కల్కి మేకర్స్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్లో హుషారు పెంచారు. ఇందులో కల్కి సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను నాగ్ అశ్విన్ స్టూడెంట్స్తో పంచుకోబోతున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అవుతూ..పోస్టర్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఇక రేపు జరగబోయే మీటింగ్లో డైరెక్టర్ నాగ్ ఎలాంటి విషయాలు పంచుకోకున్నాడో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే!